అనంతపురం న్యూసిటీ : పాతూరు తిలక్‌రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ జాప్యంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ నెల 21న నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరవధిక నిరసన దీక్ష చేపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుపడుతున్నారనే నేపథ్యంలో దీక్షకు సిద్ధమైనట్లు తెల్సింది. సీఎం విస్తరణ కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా ఆ ప్రజాప్రతినిధులు అడ్డు తగులుతున్నారని ఎంపీ గతంలోనే ఆరోపించారు. ఎంపీ దీక్ష చేపడుతుండడం నగరంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఆందోళనలకు చేపడుతాం : ఇటీవల ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శస్త్ర చికిత్స చేయించుకున్నారని, నిరసన దీక్షలో ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అనంత నగరాభివృద్ధి వేదిక అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ నిరవధిక నిరసన దీక్షకు నగరాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
రేపు ఎంపీ జేసీ నిరసన దీక్ష
Published Sat, Nov 19 2016 11:31 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM
Advertisement
Advertisement