![‘అమరావతితో మాకు పనిలేదు’ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/51497004167_625x300.jpg.webp?itok=85lIewvq)
‘అమరావతితో మాకు పనిలేదు’
రాయదుర్గం: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో మాటలు విసిరారు. 2019లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని సీఎం చంద్రబాబు సమక్షంలో కుండబద్దలు కొట్టారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన సభకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి మట్లాడుతూ... అమరావతితో తమకు పనిలేదని, త్వరగా పోలవరం పూర్తి చేయాలని అన్నారు. చంద్రబాబుకు దేవుడు కూడా సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాట ధరం రావడం లేదని, దళారుల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. చంద్రబాబు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2020 నాటికి పూర్తి చేయడం సాధ్యం కాదని, దానికి అదనంగా నాలుగైదేళ్లు పడుతుందని గతంలో దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.