సొమ్ములున్నా..సంకల్పం సున్నా | ap mp candidates funds released | Sakshi
Sakshi News home page

సొమ్ములున్నా..సంకల్పం సున్నా

Published Thu, Dec 11 2014 3:10 AM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

సొమ్ములున్నా..సంకల్పం సున్నా - Sakshi

సొమ్ములున్నా..సంకల్పం సున్నా

 ‘దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్ అప్పట్లో తెలుగునాట బాగా క్లిక్ అయింది. ‘రాష్టం క్లిష్ట పరిస్థితిలో ఉంది’.. ఆర్నెళ్ల క్రితం అధికారంలోకొచ్చిన తెలుగుదేశం సర్కారు అనేక సందర్భాల్లో వల్లిస్తున్న మాట ఇది. పట్టణాల్లో వందరోజుల ప్రణాళిక నుంచి పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాల వరకూ సొమ్ములు విదల్చడానికి  తటపటాయిస్తుండగా.. మరోపక్క ఆ పార్టీకే చెందిన జిల్లా ఎంపీలు ముగ్గురూ కేంద్రం ఇచ్చిన సొమ్ములతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపే తీరిక లేకుండా ఉన్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘కోట్లు కుమ్మరించైనా మీరడిగిన పనులన్నీ చేసేస్తా’మని  ఎన్నికల్లో  బీరా లు పలికారు టీడీపీ ఎంపీ అభ్యర్థులు. అది నమ్మి జిల్లా జనం ఆ ముగ్గురు అభ్యర్థుల్నే పార్లమెంటుకు పంపించారు. వారు ఎన్నికై అప్పుడే ఆరు నెలలు గడిచింది. ఇప్పుడు నిధులు దండిగా ఉన్నా పనుల మాటటుంచి కనీసం ప్రతిపాదించేందుకు కూడా వారు పూనుకోవడం లేదు.  కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న  వారిలో కాకినాడ ఎంపీ తోట నరసింహానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ 2004 ఎన్నికల్లో ఓటమి చెందగా, 2014లో గెలుపొందారు.
 
 అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుకు ఎన్నికల గోదాలో దిగిన తొలిసారే ప్రజలు పట్టంకట్టారు. ఈ ముగ్గురూ ఎంపీ బరిలోకి దిగిన నేపథ్యం ఏదైనా ప్రజలు మాత్రం వారిని ఆదరించారు. జనం రుణం తీర్చుకోవడానికి తమ, తమ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఎంపీలు అందుకు విరుద్ధంగా అలసత్వం వహిస్తున్నారని నియోజకవర్గాల ప్రజలు నిరసిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులకు చంద్రబాబు సర్కార్ కోతపెట్టడంతో ఎమ్మెల్యేలకంటూ నిధులు లే కుండా పోయాయి. కనీసం ఎంపీలకు కేం ద్రం ఇచ్చే స్థానిక అభివృద్ధి నిధుల (ఎంపీ ల్యాడ్స్)తోనైనా అభివృద్ధి పనులు చేపడతారనుకుంటే ముగ్గురు ఎంపీలకూ ఆ ధ్యాసే కరువైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 పాలనామోదం లభించినా..
 ఎంపీ లాడ్స్‌గా ఒక్కో ఎంపీకీ ఏడాదికి రూ.5 కోట్లు కేంద్రం విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా తొలి విడతగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలకూ రూ.2.50 కోట్ల వం తున నిధులకు పరిపాలనామోదం లభించింది. ఈ మేరకు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ మన ఎంపీలు ఎందుకనో ఆ నిధుల జోలికి పోవడం లేదు.  వచ్చిన నిధులతో అభివృద్ధి పనుల్ని ప్రతిపాదించే తీరికా, ఓపికా ముగ్గురు ఎంపీలకూ  లేదని జిల్లా ప్రజలు ఆక్షేపిస్త్తున్నారు. ఎంపీ లాడ్స్‌తో గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్లు, డ్రైన్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు వీలుంటుంది. పనులకు ప్రతిపాదనలు ఇవ్వడమే తరువాయి అని, వాటిని ఆమోదించడం పెద్ద విషయం కాదని జిల్లా యంత్రాంగం చెబుతోంది.
 
 అయితే ప్రతి పాదనల కోసం నిరీక్షిస్తున్నా ఎంపీల నుం చి స్పందన లేదంటున్నారు. కాగా ముగ్గురు ఎంపీల్లో తోట నరసింహం   రూ.2 లక్షల విలువైన ఉపకరణాలు వికలాంగులకు ఇవ్వాలని ప్రతిపాదించినా.. అనంతరం ఆ ఊసే మరిచారు. పోనీ.. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన  గ్రామాల్లో అయినా పనులు చేపట్టేందుకు చొరవ తీసుకున్నారా అదీ లే దని అధికారులు చెపుతున్నారు. ఇకనై నా.. ఎంపీలు అలసత్వాన్ని వీడి, పరిపాలనామోదం లభించిన ఎంపీ లాడ్స్‌కు ప్ర తిపాదనలు పంపి, ప్రజోపయోగకరమైన పనులను చేయిస్తే పదవికి సార్థకత, ఎన్నుకున్న వారి మన్నన దక్కుతాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement