తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఆయన ప్రశంసించారు. మల్కాజ్గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ లాంటి సీఎం ఉండటం మన అదృష్టమన్నారు.