హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇద్దరు కుమారులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్ సహా ఏడుగురికిపై కర్ణాటకలో కేసు నమోదు అయింది. టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో 143, 147, 323, 504, 427, 506, 149 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లూరు జిల్లా బాగేపల్లి టోల్‌గేట్ వద్ద టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు ఆగ్రహించిన కిష్టప్ప వర్గీయులు సోమవారం ఉదయం టోల్‌ప్లాజాపై దౌర్జన్యానికి పాల్పడి, నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.