'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై | NRI tries to save de satyanandam from call money case through lobbying | Sakshi
Sakshi News home page

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై

Published Wed, Dec 16 2015 10:28 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై - Sakshi

'ఆయన' కోసం రంగంలోకి దిగిన ఎన్నారై

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాల్ మనీ' కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఎన్నారైల వ్యవహారాలను చూస్తున్న టీడీపీ రాజ్యసభ ఎంపీ ద్వారా ఎన్నారై ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారని తెలిసింది. గతంలో సత్యానందంకి కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ టికెట్ ఇప్పించేందుకు కూడా ఈ ఎన్నారై రంగంలోకి దిగారు. కానీ అది సాధ్యపడలేదని సమాచారం. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటికే సత్యానందంపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement