
బైకు పైనుంచి పడిన ఎంపీ గల్లా జయదేవ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్కు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో బైకు పైనుంచి పడి గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన కుమారుడి కోసం కొత్త బైకు కొని ట్రయల్స్ చూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎంపీ గల్లాకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెన్నెముకకు మాత్రమే గాయమైందని చెప్పారు. బైకు అదుపు తప్పడంతో ఆయన దాని మీద నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. పక్కన ఉన్న వారు వెంటనే గమనించి ఆయనను అక్కడి నుంచి పక్కకు తీసి తక్షణమే అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎంపీ గల్లా జయదేవ్.. టాలీవుడ్ హీరో మహేశ్ బాబుకు సమీప బంధువు.