
'బీజేపీతో యుద్ధం చేయలేం'
బీజేపీతో మేము యుద్ధం చేయలేమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ : బీజేపీతో మేము యుద్ధం చేయలేమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ప్రత్యేక హోదా సాధించేంత బలం లేదని ఆయన తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు సభలో నేడు ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుపై టీజీ వెంకటేష్ స్పందించారు.
కె.వి.పి.రామచంద్రరరావు కేవలం పొలిటికల్ లద్ధి కోసం బిల్లు పెడితే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యానాం కలిపితే మద్దతిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాకు ఆమోదం తెలిపితేనే... జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామని బీజేపీపై ఎందుకు ఒత్తిడి చేయరు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.