గుంతకల్లు : గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు కోసం కృషి చేయాల్సిన ఎంపీ దివాకర్‌రెడ్డి బాధ్యతలను విస్మరించి మురికి కాలువలు శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నం కావడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లులోని ఎఫ్‌సీఐ గోడౌన్ , హెచ్‌పీసీ డిపోలు మూడపడినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. రైల్వేజోన్ ఏర్పాటు విశాఖపట్నంలో సాధ్యం కాదని మరోచోట ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సముఖత చూపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
గుంతకల్లు రైల్వేజోన్ కేంద్రంగా పెట్టాలని ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది మరిచి మేయర్ చేయాల్సిన పనిని ఎంపీ చేయడంమేంటని ఆయన ప్రశ్నించారు. రైల్వేజోన్ సాధనకు ఈ నెల 5 న రాజ్యసభ సభ్యుడు టీజీ. వెంకటేష్‌ను కలువనున్నామని తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో ఢిల్లీకి వెళ్లి రైల్వేజోన్ అంశంపై రాయలసీమలోని ఎంపీలందరికి నివేదిస్తామన్నారు.
బాధ్యతలు విస్మరించిన ఎంపీ జేసీ
Published Wed, Nov 2 2016 11:45 PM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement
Advertisement