ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమాలు చేయమని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమాలు చేయమని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. శనివారం అనంతపురం జిల్లా పెనుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్నిఇరుకున పెట్టబోమని తేల్చి చెప్పారు. స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ హోదా రాకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధిస్తామన్నారు.