Nimmala Kistappa
-
ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ సీపీ సర్కారుతో కనెక్ట్ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ వర్సెస్ జూనియర్స్ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది. -
సైకిల్లో అనంత ఘోష.. కిష్టప్పతో ఆయనకు కష్టమేనా? తారాస్థాయికి టికెట్ పంచాయితీ!
పార్టీ పాతాళంలో ఉన్నా.. నాయకుల మధ్య ఫైటింగ్ మాత్రం తప్పడంలేదట పచ్చ పార్టీలో. ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్ళు శత్రువుకు శత్రువు.. తనకు మిత్రుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు ఇవ్వకపోతే తన మనిషికైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీలోని శత్రువుకు మాత్రం ఇవ్వవద్దని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ శత్రువులు, మిత్రులు ఎవరో చూద్దాం. సారథికి సొంత పార్టీనుంచే వెన్నుపోటు ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, పెనుకొండ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గం పార్టీ ఇంఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బీకే పార్థసారథికి సొంతపార్టీ నేతలే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కూతురు, కురుబ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సవిత ఇప్పుడు బీకే పార్థసారథికి చుక్కలు చూపిస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు తనకే టిక్కెట్ ఇస్తున్నట్లు ఆమె ప్రచారం చేసుకుంటున్నారు. తమ్ముళ్ల కళ్లలో టిక్కెట్ల ఆనందం మరోవైపు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చాలాకాలంగా పెనుకొండ నియోజకవర్గంపై కన్నేశారు. ఆయన సొంత ఊరు గోరంట్ల పెనుకొండ నియోజకవర్గ పరిధిలోకి రావడంతో తనకు ఎంపీ టిక్కెట్ వద్దు. పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని నిమ్మల కిష్టప్ప పార్టీ అధినేతను కోరారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వని పక్షంలో సవితకు మద్దతు ఇవ్వాలని తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో బీకే పార్థసారథి తనను ఏ మాత్రం పట్టించుకోలేదని. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకుండా అవమానించినందున పార్థసారథికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పార్టీ శ్రేణులతో స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో టీడీపీ మహిళా నేత సవిత దూకుడుగా ముందుకెళ్తున్నారు. పార్థసారథికి పోటీగా పెనుకొండలో ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా మద్దతు ఇస్తున్నందున ఖచ్చితంగా తనకే టిక్కెట్ వస్తుందని ఆమె చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలపై బీకే పార్థసారథి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేనే గొప్ప.. నాకే కావాలి గత పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ అనేక పదవులు అనుభవించానని ఇప్పుడు కూడా శ్రీసత్యసాయి జిల్లా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ పెనుకొండ ఇంఛార్జి బాధ్యతలు చూస్తున్న తనకే అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని బీకే పార్థసారథి భావిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నందున తన అనుమతితోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ తనకు వ్యతిరేకంగా సవిత, నిమ్మలకిష్టప్ప గ్రూపులు పనిచేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు పెనుకొండ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారంలో ఉన్నన్నాళ్లూ హడావుడి చేసిన టీడీపీ నేతలు పత్తాలేకుండా పోయారు. ఎన్నికల వేళ కిందిస్థాయి కార్యకర్తలను ఉసిగొలిపి రచ్చ చేసిన వారంతా ఓటమి తర్వాత తలోదారి చూసుకున్నారు. చుట్టపుచూపుగా కూడా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పాలని చూసినా ఇక వారిని నమ్మకూడదని కార్యకర్తలు నిర్ణయం తీసేసుకున్నారు. కొందరు నాయకులు అధికారం కోసమే రాజకీయం చేస్తారు. ఫలితం తిరగబడితే చాపచుట్టేస్తారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి తాము మాత్రం హాయిగా ఉండిపోతారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఊరూరూ తిరిగిన నేతలు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. కనీసం నెలకోసారి వచ్చి కార్యకర్తలనైనా పలకరించే పరిస్థితి లేదు. దీంతో కేడర్ కూడా తలోదారి చూసుకుంటోంది. ఏమప్పో.. ఇట్ల ‘జేస్తి’రి! 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్‌రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు... పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండే పవన్.. ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోగానీ, సమావేశాల్లోగానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి పోతున్నారు. యువ నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి ‘తమ్ముళ్లు’ ఏందప్పా ఇట్ల జేస్తిరి అంటూ నిట్టూరుస్తున్నారు. వలసపోయినా.. కానరాని ‘వరద’ టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్మెన్లు, మందీమార్బలంతో కనిపించిన వారెవరంటే టక్కున గుర్తించేవారు వరదాపురం సూరి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. కొన్నాళ్లకే అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే వలస రాగం అందుకున్నారని విమర్శలున్నాయి. బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పోనీ.. ఆ పార్టీ నాయకులకైనా అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదు. అయితే, 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తుండగా.. అదే పార్టీకి చెందిన పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. వరదాపురంసూరికి సన్నిహితంగా ఉన్న వారు సైతం ఏ కండువా వేసుకోవాలో తెలియక ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటీముట్టనట్టుగా.. నిమ్మల కిష్టప్ప 2019లో హిందూపురం పార్లమెంటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప రాజకీయాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. సామాజిక వర్గ సమీకరణలనే నమ్ముకున్న ఆయనకు, 2024లో టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానాలూ ఉన్నాయి. చుట్టపు చూపుగా బాలయ్యా హిందూపురం నియోజకవర్గ వాసులు 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. కానీ ఆయన చుట్టపు చూపుగా ఆరుమాసాలకోసారి కూడా నియోజకవర్గానికి రావడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో ఆయన పీఏనే మొత్తం చూసుకునేవారు. ఆ పీఏ కూడా ఇటీవలే పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. దీంతో అతన్ని తీసేశారు. దీంతో అసలు బాలకృష్ణ ఎప్పుడొస్తారన్న విషయం నియోజక వర్గ ప్రజలకు కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఇంకోసారి నమ్ముకోవద్దని అటు టీడీపీ కేడర్‌తో పాటు జనం కూడా నిర్ణయించుకున్నారు. అందువల్లే బాలయ్య ఎప్పుడోకసారి వచ్చినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉనికి పాట్లలో కొందరు.. పరాజయం పాలయ్యాక కొందరు టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్లుగా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వచ్చేవారు మాత్రం ‘ఉనికి’ చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారు గిమ్మిక్కులు చేస్తూ పత్రికలకెక్కుతున్నారు. చదవండి: అన్నదమ్ముల అస్త్రసన్యాసం! కానీ సొంత పార్టీ నేతలే వారి తీరును తప్పుపడుతున్నారు. ‘మంత్రులుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు’ అన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుండడం ఇక్కడ కొసమెరుపు. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్న ప్రభాకర్ చౌదరితో సహా చాలా మంది అసలు టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో దిక్కుతెలియని పరిస్థితిలో పడిపోయారు. దీంతో కేడర్ దిక్కులేక తలోదిక్కు చూసుకుంది. ఇక గుంతకల్లులో జితేందర్ గౌడ్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనే విమర్శలున్నాయి. -
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అదే హాట్ హాట్ టాపిక్
ఆయన ఓ సీనియర్ పొలిటీషియన్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పన్నేండేళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు. ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన భవిష్యత్తు కోసం ప్రశ్నార్థకంగా ఎదిరిచూస్తున్నారు. ఆయనే నిమ్మల కిష్టప్ప. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గోరంట్ల అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన నిమ్మల కిష్టప్ప చంద్రబాబునాయుడు క్యాబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004 నిమ్మల కిష్టప్ప ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోరంట్ల అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. దాని స్థానంలో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. గోరంట్ల మండలం పెనుకొండ నియోజకవర్గంలో కలిసిపోయింది. దీంతో నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటుకు షిప్ట్ అయ్యారు. హిందూపురం నుంచి ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేద్దామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేకపోయినా... మళ్ళీ హిందూపురం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అదీ దక్కే పరిస్థితులు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్ నిమ్మల కిష్టప్పకు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. నిమ్మల కిష్టప్ప స్థానంలో మరో బీసీ నేతకు ఇక్కడ అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిమ్మల కిష్టప్పకు టిక్కట్ ఉండదన్న సంకేతాలు ఇచ్చినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వైఖరిపై నిమ్మల కిష్టప్ప గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా అని నిమ్మల కిష్టప్ప సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ దక్కకపోతే తన సామాజిక వర్గమైన నేతన్నలు తెలుగుదేశం పార్టీకి దూరమవటం ఖాయమని కిష్టప్ప స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఏవిధంగా దెబ్బతీయాలి. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఇప్పటికే నిమ్మల కిష్టప్ప వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా పచ్చ పార్టీలో చర్చ జరుగుతోంది. -
నారా లోకేష్ ఫౌండేషన్ అధ్యక్షుడి భూమాయ
గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదలకు అందాల్సిన ప్రతి సంక్షేమ ఫలాన్నీ అడ్డగోలుగా స్వాహా చేయడమే కాకుండా రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను సైతం రాచమార్గంలో తమ పేరిట పట్టాలు చేయించుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల అక్రమాలు బయటపడుతుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షి, పుట్టపర్తి: నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పల్లపు రవీంద్ర భూ అక్రమాల్లో ఆరితేరిపోయాడు. నియోజకవర్గంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములపై కన్నేసిన ఇతను నిబంధనలను తుంగలో తొక్కి టీడీపీ పాలనలో 39.52 ఎకరాలను స్వాహా చేశాడు. బుక్కపట్నం మండలం రామసాగారానికి చెందిన ఇతను తన సోదరుడు శంకర్, కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు పొందాడు. 1996 నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఈ బాగోతం కొనసాగుతూ వచ్చింది. అసైన్డ్ భూమి అంటే?.. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్ అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు. పుట్టపర్తి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు పైగా ఇలాంటి అసైన్డ్ భూములు ఉన్నాయి. వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు గత ప్రభుత్వాలు వీటిని పంపిణీ చేశాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయట పడాలన్నదే ప్రభుత్వాల లక్ష్యం. ఒకవేళ మొదటిసారి భూ బదలాయింపు జరిగితే తహసీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి. రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు ఇవ్వాలి. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాదు.. కొనడమూ నేరమని కూడా చట్టం చెబుతోంది. (జేసీ ఆరోగ్యం కాపాడుకో..) నిబంధనలకు విరుద్ధంగా.. రెండున్నర ఎకరాల తరి లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేల కన్నా తక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు. ఇలా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు అసైన్డ్ భూమికి పట్టా పొందవచ్చు. ఈ నిబంధనలకు విరుద్ధంగా 39.52 ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు పల్లపు రవీంద్ర, అతని సోదరుడు శంకర్, వారి కుటుంబ సభ్యులు పట్టాలు పొందారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పడితే అక్కడ ఇంటి పేర్లు మార్చి తమ పేరు మీదనే కాక భార్య పేరుపై కూడా పట్టాలు పొందారు. బుక్కపట్నం మండలం మారాల రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలకు పైగా, ముదిగుబ్బ మండలం మంగలమడక రెవెన్యూ పరిధిలో మరో 19 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను వీరు అప్పణంగా కాజేశారు. వీరిద్దరూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అప్పటి ఎంపీ నిమ్మలకిష్టప్పకు సన్నిహితులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపకుండా పట్టాలు రాసిచ్చేశారు. ►ఎకరాకు గరిష్టంగా రూ.25వేలు చొప్పున 39.52 ఎకరాలకు సుమారు రూ.10 లక్షల వరకు పావలా వడ్డీకే వివిధ బ్యాంక్‌ల ద్వారా రుణం. ►ఈ రెండేళ్లలో పంట పెట్టుబడి సాయంలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద లబ్ధి. ►కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైఎస్సార్ రైతు భరోసా వర్తిస్తుంది. అయితే రవీంద్ర తన మాయాజాలంతో ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున కుటుంబంలోని నలుగురి పేరుతో ఈ రెండేళ్లలో రూ.1,08,000 స్వాహా చేశాడు. ప్రభుత్వాలను మోసగిస్తూ.. తన పేరు మీదనే కాక తన భార్య కృష్ణవేణి, సోదరుడు శంకర్, అతని భార్య జానకి పేరుతో దాదాపు 38.86 ఎకరాల భూమిని పల్లపు రవీంద్ర రాచమార్గంలోనే స్వాహా చేశాడనే విమర్శలు ఉన్నాయి. ఇతను పట్టాలు పొందిన అసైన్డ్ భూములు ఏవీ సాగుకు అనుకూలమైనవి కావు. గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, వాటిని అడ్డుగా పెట్టి పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంక్షేమ ఫలాలను దోచేస్తూ వచ్చాడు. ఈ భూముల వివరాలను అడ్డగోలుగా వాడేస్తూ ఆదాయ పన్ను మినహాయింపు పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టాడు. ఇంత కాలం ప్రభుత్వాల కళ్లుగప్పుతూ వచ్చిన పల్లపు రవీంద్ర మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కాజేసి.. ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో పల్లపు రవీంద్రను మించిన వారు లేరని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. పూర్వీకుల నుంచి పల్లపు రవీంద్ర కుటుంబసభ్యులకు 16 ఎకరాల మెట్ట భూమి సంక్రమించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తాను నిరుపేదనంటూ గత పన్నెండేళ్లలో రవీంద్ర, ఆయన సోదరుడు శంకర్, వీరి భార్య పేరుతో 39.52 ఎకరాల అసైన్డ్ భూమిని పొందారు. సాగుకు నోచుకోని ఈ భూములపై సబ్సిడీ రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా పరిహారాలను పొందుతుండటం గమనార్హం. -
గోల్మాల్ కిష్టప్ప
చేయని పనులకు నిధులు విడుదల చేయలేదని ఓ అధికారిపై ఎంపీ నిమ్మల కిష్టప్ప కన్నెర్ర చేశారు. నిబంధనలకు లోబడి పనిచేసినందుకు జిల్లా ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారులు తమదైన శైలిలో సన్మానించారు. నిజానిజాలతో పనిలేకుండా ఉన్నతాధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. బదిలీ చేయకుండా, సెలవులో వెళ్లకుండా, ఓ అధికారి కుర్చీలో ఉండగానే మరో అధికారికి బాధ్యతలు అప్పగించి పరిపాలననుఅపహాస్యం చేశారు. తన మాట వినలేదని.. చెప్పినట్లు, చెప్పినచోట సంతకాలు చేయలేదని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప.. సీపీఓ వాసుదేవరావును బలి చేశారు. ఈ ఉదంతం సీపీఓ కార్యాలయంతో పాటు జిల్లా యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ఖర్చు చేయడంలో సీపీఓ పాత్ర కీలకం. ఎస్డీఎఫ్, ఎస్డీపీ, ఎంపీ ల్యాడ్స్ నిధులకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు, నిధుల మంజూరు సీపీఓ పర్యవేక్షిస్తారు. ఈ బాధ్యతను వాసుదేవరావు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం ఆయన తన బాధ్యతలను డీడీ కాశీవిశ్వేశ్వరరావుకు అప్పగించారు. సీపీఓను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారులు బదిలీ చేయలేదు.. తప్పు చేశారని సస్పెండ్ చేయలేదు.. పోనీ సీపీఓ సెలవులోనూ వెళ్లలేదు.. ఆయన కుర్చీలో ఉండగానే డీడీకి ఎఫ్ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు) ఇవ్వడం గమనార్హం. అవినీతికి సహకరించని ఫలితం హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఏడాదికి రూ.5కోట్ల చొప్పున రూ.25కోట్లు ఎంపీ నిధులు వస్తాయి. ఇందులో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ కోటా, ఆ తర్వాత జనరల్ కోటాగా నిధులు ఖర్చు చేయాలి. కిష్టప్ప సొంత మండలం గోరంట్లలో రవి ట్యాంక్(చెరువు)కు సంబంధించి రూ.1.15కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఈ నిధుల్లో రూ.25 లక్షలు కిష్టప్ప కోటాలో, మరో రూ.25లక్షలు ఎంపీ సీఎం రమేశ్ కోటాలో, తక్కిన రూ.65లక్షలు ఉపాధిహామీ నిధులు ప్రతిపాదించారు. ఎంపీ నుంచి ప్రతిపాదనలు రాగానే సీపీఓ ఎస్టిమేషన్(అంచనా రిపోర్ట్)కు పంపారు. సంబంధిత ఏఈ, డీఈలు అంచనాలు రూపొందించి ఈఈ ద్వారాఎస్ఈకి పంపాలి. ఎస్ఈ తిరిగి ఫీజుబిలిటీ కోసం డ్వామా పీడీకి రిపోర్ట్ పంపిస్తారు. డ్వామా పీడీ అంగీకరించిన తర్వాత తిరిగి సీపీఓకు వస్తుంది. దీనికి సమయం పడుతుంది. కానీ ప్రతిపాదనలు పంపిన రెండు రోజులకే నిధులు మంజూరు చేయాలని సీపీఓపై కిష్టప్ప ఒత్తిడి తెచ్చారు. నిజానికి ఈ చెరువు పనిలో పూడిక తీతకు ప్రతిపాదనలు పెట్టారు. ఈ పనులు కేవలం ‘నీరు–చెట్టు’ ద్వారానే చేయాలి. ఎంపీ ల్యాడ్స్ ఖర్చు చేయకూడదు. రిపోర్ట్ ఎస్ఈ వద్ద ఆగింది. డ్వామా పీడీకి వెళ్లలేదు. దీంతో డ్వామా పీడీకి చెప్పండి రిపోర్ట్ నాకు పంపాలని, లేదంటే నిధులు ఇవ్వండని మీరు లెటర్ ఇవ్వండి, మంజూరు చేస్తాం అని సీపీఓ కిష్టప్పను అడిగితే లెటర్ ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. దీంతో సీపీఓపై ప్లానింగ్ సెక్రటరీ, డైరెక్టర్‌కు కిష్టప్ప ఫిర్యాదు చేశారు. సీపీఓకు ప్రజాప్రతినిధులు, అధికారులకు సరైన కమ్యూనికేషన్ లేదని, బదిలీ చేయండని కలెక్టర్ కూడా ప్రతిపాదించారు. ఆ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్ అధికారులు కలెక్టర్‌కు లేఖ రాశారు. సీపీఓ విధుల పట్ల ఎక్కడ సంతృప్తి చెందలేదో ఆధారాలతో పంపాలని అందులో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. నిబంధనల విరుద్ధంగా మరో పని చేయాలని నిమ్మల ఒత్తిడి మొత్తం రూ.25కోట్ల నిధుల్లో రూ.23.5కోట్ల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. తక్కిన రూ.1.5కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు తర్వాత పంపిస్తామని కిష్టప్ప సీపీఓపై ఒత్తిడి తెచ్చారు. పనులు చేయకుండా, వేటికి ఎంత ఖర్చు చేశారో లేకుండా ఎలా నిధులు విడుదల చేస్తామని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు 2014–15లో ఎంపీ నిధులకు సంబంధించి కిష్టప్ప చేసిన ప్రతిపాదనల్లో కొన్ని పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ఈ నిధులు అప్పటి సీపీఓ విడుదల చేయలేదు. ఆ నిధులు కూడా విడుదల చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే పనులు జరుగుతున్నట్లు ఈఈ నుంచి లెటర్ ఇప్పించండని ఎంపీని కోరారు. దీనికీ కిష్టప్ప ఒప్పుకోలేదు. 2015 వరకూ ఎంపీ ల్యాడ్స్ ఫైళ్లు డ్వామా పీడీ పర్యవేక్షించారు. 2015 నుంచి సీపీఓ పర్యవేక్షణలోకి వచ్చాయి. వాసుదేవరావు కంటే ముందు 2015లో ఒకరు, 2016–17లో ఇద్దరు సీపీఓలుగా పనిచేశారు. వారెవ్వరూ ఈ నిధులు విడుదల చేయలేదు. చేయని పనులు కాబట్టి వాసుదేవరావు కూడా ససేమిరా అన్నారు. వీటితో పాటు మరో 113 పనులకు రూ.1.64కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఎంపీ నిధులు ఎస్సీ, ఎస్టీ కోటా పూర్తి చేసిన తర్వాతే జనరల్ కోటా భర్తీ చేయాలి. 113 పనుల్లో 16 పనులు ఎస్సీ, ఎస్టీ కోటా కింద.. తక్కిన 97 జనరల్ కోటాలో ఉన్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ కోటా పనులు పూర్తి చేయండని ఎంపీకి సీపీఓ తెలిపారు. దీనికి కిష్టప్ప ససేమిరా అన్నారు. ఇలా చేయని పనులు చేసినట్లు యూసీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్)లు ఇవ్వండని ఒత్తిడి తెచ్చారు. ఈ తప్పుడు రికార్డులపై సంతకాలు చేస్తే సీపీఓనే బాధ్యత వహించాలి. సీపీఓ సంతకం చేసేదాకా కలెక్టర్ సంతకం చేయని పరిస్థితి. దీంతో సీపీఓను సెలవులో వెళ్లమని కిష్టప్ప హుకుం జారీ చేశారు. దీనికి సీపీఓ వినలేదు. ఈక్రమంలో కిష్టప్ప తిరిగి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు ఉన్నతాధికారులు వాసుదేవరావును పద్ధతి లేకుండా పక్కనపెట్టేశారు. వాసుదేవరావును తప్పించేలాజీవోలపై జీవోలు అనంతపురం సీపీఓగా డీడీ కాశీవిశ్వేశ్వరరావుకు ఎఫ్ఏసీ ఇస్తూ ఉత్తర్వులు పంపారు. దీంతో సీపీఓ పోస్టును ఖాళీగా చూపించారు. నిజానికి సీపీఓగా వాసుదేవరావు ఉన్నారు. ఆ రోజు నుంచి సీపీఓ రోజూ విధుల్లోకి వస్తున్నారు. ఇది తెలిసి సీపీఓ ఈ–ఆఫీసును నిలిపేశారు. దీంతో ఆయన పనులకు ఆటంకం ఏర్పడింది. తిరిగి ఈ నెల 3న మరో ఉత్తర్వు పంపారు. ఇందులో సీపీఓలో సెలవులో ఉన్నారని, అందుకు డీడీకి ఎఫ్ఏసీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ సీపీఓ విధుల్లోనే ఉన్నారు. అదేరోజు సర్క్యులర్‌ను కార్యాలయంలోని అందరికీ ఇచ్చి సంతకాలు పెట్టించి డైరెక్టరేట్‌కు పంపారు. దీంతో గురువారం వాసుదేవరావు డీడీకి బాధ్యతలు అప్పగించి వచ్చేశారు. చేయని పనులకు బిల్లులు చేయమన్న ఫలితానికి ఓ అధికారిపై టీడీపీ ఎంపీ కక్షగట్టి, అతన్ని వేధించిన తీరు ఇది. ఉన్నతాధికారులు కూడా వాస్తవాలతో పనిలేకుండా అధికారిపై వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సెలవులో వెళ్లమని చెప్పారు. రేపు ఎంపీ రాజీనామా చేయమంటే చేయలా? అని అంతా ప్రశ్నిస్తున్నారు. తప్పు చేస్తే సస్పెండ్ చేయండి నేను తప్పు చేయకపోయినా లీవ్‌లో వెళ్లమన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ఈ క్రమంలో నేను బలవంతంగా లీవ్‌లో వెళితే నాకు జీతం రాదు. తప్పు చేస్తే బదిలీ చేయండి. లేదంటే సస్పెండ్ చేయండి. అంతే కానీ ఇలా చేయడం బాధించింది. నేను ఉండి, ఎఫ్ఏసీ ఇచ్చిన డీడీ ఉంటే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. నా వల్ల ప్రభుత్వ విధులకు ఆటంకం ఏర్పడకూడదని నేను బాధ్యతలు అప్పగించి వచ్చేశా. – వాసుదేవరావు, సీపీఓ -
కృష్ణార్జున యుద్ధం!
పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప మధ్య వైరం మరింత ముదిరింది. ఈ నాలుగున్నరేళ్లుగా అవకాశం చిక్కిన ప్రతిసారీ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ వచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలైనా.. ప్రైవేట్ పనులైనా ఒకరు ముందు.. మరొకరు వెనుక హాజరవుతూ వచ్చారు. వేదికలపై కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటూ, మరొకరు లేచి వెళ్లిపోయే సంస్కృతిని అలవాటు చేసుకున్నారు. ఇటీవల ఈ పరిస్థితి మరింత దిగజారింది. ఎంపీ కిష్టప్పను రాజకీయంగా పూర్తిగా అణచివేసేందుకు ఎమ్మెల్యే బీకే చేస్తున్న ప్రయత్నాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో పార్థుడి వ్యవహారంపై కిష్టప్ప గుర్రుగా ఉన్నారు. ఇటీవల సీఎం పర్యటనలో ఎమ్మెల్యేకు విరుద్ధంగా ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతపురం,పెనుకొండ : ఎమ్మెల్యే బీకే పార్థసారథి, ఎంపీ నిమ్మలకిష్టప్ప మధ్య వైరం తారస్థాయికి చేరుకుంది. ఇంతకాలం నిప్పూ, ఉప్పులా ఉండే ఈ ప్రజాప్రతినిధులు.. మళ్లీ విభేదాలతో వీధికెక్కారు. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద వాపోయినట్లు సమాచారం. భగ్గుమన్న ఎంపీ వర్గీయులు ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను రెచ్చగొట్టేందుకే ఎమ్మెల్యే పార్థసారథి పోలవరం యాత్ర సాగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఎంపీ వర్గీయులను పూర్తిగా పక్కన బెట్టి కేవలం తన అనుచరులను మాత్రమే ఎమ్మెల్యే సానంపారు. దీనిపై ఎంపీ వర్గీయులు భగ్గుమన్నారు. ఎన్నికల్లో కేవలం ఆయన అనుచర వర్గం మాత్రమే ఓట్లు వేయించలేదని, సమష్టి కృషితోనే ఎమ్మెల్యేగా ఆయన గెలిచారంటూ వ్యాఖ్యానించారు. ఆరంభం నుంచి ఎమ్మెల్యే తమను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై ఎంపీ ఎదుట తమ అక్కసును వెళ్లగక్కారు. తమకు గుర్తింపు లేకుండా చేయడానికే ఎమ్మెల్యే ఇలా వ్యవహరించారంటూ పెద్ద దుమారమే లేపారు. రైతులను పిలుచుకెళ్లాల్సిన చోట పార్టీ కార్యకర్తలను ఎలా తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. దీని వల్ల పార్టీ ప్రతిష్టను ఎమ్మెల్యే పార్థసారథి మంటగలుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి దక్కలేదనే అక్కసు? నిమ్మల వల్లే తనకు మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో ఎమ్మెల్యే బీకే.రగిలిపోతున్నట్లు సమాచారం. ఎంపీసిఫారసు చేయడం వల్లనే పల్లె రఘునాథరెడ్డికి గతంలో మంత్రి పదవి దక్కిందనే వాదనలూ ఉన్నాయి. అప్పటి నుంచి ఎంపీపై అసంతృప్తితో ఎమ్మెల్యే రగలిపోతూ వచ్చారు. ఇలాంటి తరుణంలోనే ఎంపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటూ వచ్చారు. గోరంట్ల మండలం కమ్మవారుపల్లికి రూ.90 లక్షలతో ఎంపీ కోటా, ఉపాధి నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు తన వర్గీయుడైన సర్పంచ్ సుధాకరరెడ్డి ద్వారా ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. నీరు– చెట్టు పనుల కేటాయింపుల్లో ఎంపీ వర్గీయులు సభ్యులుగా ఉన్న జన్మభూమి కమిటీ ద్వారా తనకు అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యేతో జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ కుటుంబసభ్యులు వాపోవడంతో, ఏకంగా కమిటీల్లో ఉన్న ఎంపీ వర్గీయులను ఎమ్మెల్యే తొలగించడం వీరి మధ్య ఆధిపత్య పోరుకు పరాకాష్టగా నిలిచింది. ఇసుక మాఫియా విషయంలో ఘర్షణలు తలెత్తి ఎమ్మెల్యే అనుచరుడు నరేష్ హత్య కావడంతో ఆ సమయంలో ఎంపీ వర్గీయులపై ఎమ్మెల్యేతో పాటు ఆయన వర్గీయులు బహిరంగ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచనలమైంది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేవారిపై చర్యలు తప్పవని, అవసరమైతే రాబోవు ఎన్నికల్లో వారికి టికెట్ కూడా ఇచ్చేది లేదంటూ మూడు రోజుల క్రితం అనంత వేదికగా సీఎం చేసిన ప్రకటన.. ఈ ఇద్దరి విషయంలో ఎంత వరకు నిజమవుతుందో వేచి చూడాలి. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఎదుటి వారి కళ్లకు గంతలు కట్టే ఈ నాయకుల వ్యవహారం ఎన్నికల నాటికి ఎలా ఉంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. -
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
-
ఎంపీ తనయులకు బెయిల్, ఆందోళన
అనంతపురం: బాగేపల్లి టోల్‌ప్లాజాపై దాడి కేసులో హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులను బెయిల్ పై విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాగేపల్లి పోలీసుస్టేషన్లో లొంగిపోయిన నిమ్మల కిష్టప్ప కుమారులు అంబరీష్, శిరీష్‌లను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై బాగేపల్లి టోల్‌ప్లాజా సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మాపై దాడి చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెడతారా అని పోలీసులను ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిడుల కారణంగానే పోలీసులు మెతగ్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొత్త ఫర్నీచర్ కొనిస్తామని ఎంపీ నిమ్మల కిష్టమ్మ ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. అంబరీష్, శిరీష్ సోమవారం ఆంధ్ర– కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో వీరంగం సృష్టించారు. టోల్గేట్ వద్ద అంబరీష్ అనుచరుల కారును ఆపి గేట్ ఫీజు అడిగారన్న కోపంతో విధ్వంసానికి దిగారు. టోల్‌ప్లాజాపై దాడి చేసి.. కంప్యూటర్లు, అద్దాలు పగలగొట్టారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని బాధితులను బెదిరించారు. దీంతో బాగేపల్లి పోలీసులు నిమ్మల అంబరీష్, నిమ్మల శిరీష్, పాపన్న, నరేష్, లక్ష్మీపతి, మునికుమార్, శ్రీకృష్ణపై 149, 143, 147, 323, 324, 504, 427, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
'హోదా కోసం ఉద్యమాలు చేయం'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తాము ఉద్యమాలు చేయమని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. శనివారం అనంతపురం జిల్లా పెనుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్నిఇరుకున పెట్టబోమని తేల్చి చెప్పారు. స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ హోదా రాకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధిస్తామన్నారు. -
పార్లమెంట్ ఓబీసీ కమిటీ చైర్మన్‌గా నిమ్మల కిష్టప్ప!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లోని ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పను నియమించనున్నారు. ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నిమ్మలను నియమిం చాలని ప్రధానిని కోరినట్లు టీడీ పీ వర్గాల సమాచారం. గతంలో ఈ పదవిని ఎంపీ దత్తాత్రేయ నిర్వహించారు. ఆయన్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో నిమ్మల పేరును బాబు సూచించినట్లు తెలిసింది.