![ఆ ముగ్గురికి కులగజ్జి పట్టుకుంది - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41472375596_625x300_0.jpg.webp?itok=x-48E3l1)
ఆ ముగ్గురికి కులగజ్జి పట్టుకుంది
అనంతపురం : అనంతపుం జిల్లా టీడీపీ నాయకుల్లో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అనంతపురంలో ప్రబలిన విషజ్వరాలపై స్థానిక టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఆదివారం స్పందించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్కు కులగజ్జి పట్టుకుందని విమర్శించారు.
అనంతలో పారిశుద్ధ్యం పడకేసిందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని జేసీ దివాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను అభివృద్ధి చర్యలు ప్రారంభిస్తే.. దానికి సైతం వారు అడ్డుపడ్డారని ఎంపీ జేసీ మండిపడ్డారు.