సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మేం 13 సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆనాడు అనుమతించలేదన్నారు. మేం రాజీనామా చేసిన వెంటనే టీడీపీ అవిశ్వాసం అనుమతించారని వైఎస్సార్‌సీపీ నేత పేర్కొన్నారు. 50మందికి పైగా సభ్యుల మద్దతున్నా అవిశ్వాసానికి అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
టీడీపీ-బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే ఇది జరిగిందని వైవీ ఆరోపించారు. ‘హోదాపై పీఎం మోదీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? నాలుగేళ్ల పాటు కేంద్ర కేజినెట్‌లో పాల్గొని.. ఏనాడు హోదా గురించి టీడీపీ నేతలు మాట్లాడలేదు. విభజన హామీలు నెరవేర్చకుండా 5కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ డ్రామాలో భాగంగానే ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో హోదాకోసం పొరాడాం. ఆమరణ దీక్ష చేశాం, రాజీనామాలు కూడా చేశాం. మేం చేసిన పోరాటాల వల్లే హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది’ అని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment