కడప కమిషనర్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం | tdp leaders attacks on govt officers in kadapa | Sakshi
Sakshi News home page

కడప కమిషనర్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం

Published Mon, Feb 15 2016 2:11 PM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

కడప కమిషనర్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం - Sakshi

కడప కమిషనర్‌పై టీడీపీ నాయకుల దౌర్జన్యం

వైఎస్సార్ జిల్లా: కడపలో ప్రభుత్వ అధికారులపై టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. కడప మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళేశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మల్లికార్జునపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు.

టీడీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, మోహన్‌రెడ్డి సోమవారం కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి... కమిషనర్, ఎస్‌ఈలను అసభ్య పదజాలంతో దూషించారు. అనంతరం ఎస్‌ఈని కొట్టేందుకు ప్రయత్నించబోగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. తమకు కాంట్రాక్టులు కేటాయించడం లేదంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై టీడీపీ నాయకులు ప్రవర్తించిన తీరుతో అందరూ విస్తుపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement