సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.
నిన్న(మంగళవారం) 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వలు జారీ చేయగా, కాగా తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment