massive transfers
-
AP: భారీగా కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లుశ్రీకాకుళం-స్వప్నిల్ దినకర్పార్వతీపురం- శ్యామ్ ప్రసాద్విశాఖపట్నం-హరీంద్రప్రసాద్అనకాపల్లి- కె.విజయఅంబేద్కర్ కోనసీమ జిల్లా-రావిరాల మహేష్కుమార్లపల్నాడు-అరుణ్బాబునెల్లూరు- ఆనంద్తిరుపతి- వెంకటేశ్వర్అన్నమయ్య జిల్లా - చామకూరి శ్రీధర్వైఎస్సార్ జిల్లా - లోతేటి శివశంకర్శ్రీసత్యసాయి జిల్లా- టీఎస్ చేతన్నంద్యాల -బి.రాజకుమారి -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి.సాయి ప్రసాద్పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిపౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్ (ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమేని భాస్కర్ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్గౌర్సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్నఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శిగా అహ్మద్బాబుపశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లు జీఏడీకి బదిలీ -
తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. నిన్న(మంగళవారం) 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వలు జారీ చేయగా, కాగా తాజాగా బుధవారం మరో 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పురుపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో కూడా ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్మెంట్ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, తెలంగాణ ఆబ్కారీశాఖలో 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇద్దరు ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో పెద్ద ఎత్తున తహశీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహశీల్దార్లు, 32 మంది డిప్యూటీ కలెక్టర్ల(ఆర్డీవో)ను బదిలీ చేసింది. -
మైనింగ్‌లో భారీ బదిలీలు
జిల్లా ఏడీగా ప్రదీప్‌కుమార్ కరీంనగర్ విజిలెన్స్ ఏడీగా బలదాసు డీడీగా కె.యాదగిరి నియామకం వరంగల్ : భూగర్భ వనరుల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ శాఖలో పనిచేసే జిల్లా అధికారులందరూ బదిలీ అయ్యారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మైనింగ్ శాఖ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్(డీడీ) వరంగల్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ఈ మేరకు మైనింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె.యాదగిరి వరంగల్ డీడీగా నియమితులయ్యారు. ప్రస్తుతం వరంగల్ డీడీగా ఉన్న కె.లక్ష్మణ్‌బాబు నిజామాబాద్ డీడీగా బదిలీ అయ్యారు. వరంగల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టరు(ఏడీ)గా ఎ.ప్రదీప్‌కుమార్ నియమితులయ్యారు. ప్రదీప్‌కుమార్ ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఏడీగా పని చేస్తున్నారు. వరంగల్ ఏడీగా పని చేస్తున్న ఎం.బాలదాసు కరీంనగర్ జిల్లాలో మైనింగ్ విజిలెన్స్ విభాగం ఏడీగా బదిలీ అయ్యారు. వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా పని చేస్తున్న బి.సత్యనారాయణ నల్లగొండ విజిలెన్స్ విభాగానికి, నల్లగొండ జిల్లా విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్న పి.శ్రీనివాస్ వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా బదిలీపై రానున్నారు. అలాగే, మిర్యాలగూడ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్.బాలు వరంగల్ డీడీ కార్యాలయంలో రాయల్టీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్.క్రాంతికుమార్ నిజామాబాద్ ఏడీ కార్యాలయానికి, మహబూబాబాబ్ విజిలెన్స్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.గంగాధరరావు ఖమ్మం ఏడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎం.సురేఖ వరంగల్ ఏడీ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న కె.ఆనంద్ వరంగల్‌కు, వరంగల్‌లో పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. అలాగే, వరంగల్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.విజయకుమార్ మంచిర్యాల ఏడీ కార్యాలయానికి, వరంగల్ డీడీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సీహెచ్.రామమూర్తి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏడీ కార్యాలయానికి, ఎ.నాగలక్ష్మి వరంగల్ ఏడీ కార్యాలయానికి, ఎం.డీ.రసూలొద్దీన్ కరీంనగర్ ఏడీ విజిలెన్స్‌కు, ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న సంతోష్ హైదరాబాద్‌లోని డీడీ కార్యాలయానికి, హైదరాబాద్ డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.నాగరాజు వరంగల్ డీడీ కార్యాలయానికి, కొత్తగూడెం ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.శోభారాణి వరంగల్ డీడీ కార్యాలయానికి, కరీంనగర్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న బి.ఆనంద్‌కుమార్ స్టీఫెన్సన్ వరంగల్ ఏడీ కార్యాలయంలో నియమితులయ్యారు.