- జిల్లా ఏడీగా ప్రదీప్‌కుమార్
- కరీంనగర్ విజిలెన్స్ ఏడీగా బలదాసు
- డీడీగా కె.యాదగిరి నియామకం
మైనింగ్‌లో భారీ బదిలీలు
Published Thu, Aug 4 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
వరంగల్ : భూగర్భ వనరుల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ శాఖలో పనిచేసే జిల్లా అధికారులందరూ బదిలీ అయ్యారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మైనింగ్ శాఖ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్(డీడీ) వరంగల్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ఈ మేరకు మైనింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె.యాదగిరి వరంగల్ డీడీగా నియమితులయ్యారు.
ప్రస్తుతం వరంగల్ డీడీగా ఉన్న కె.లక్ష్మణ్‌బాబు నిజామాబాద్ డీడీగా బదిలీ అయ్యారు. వరంగల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టరు(ఏడీ)గా ఎ.ప్రదీప్‌కుమార్ నియమితులయ్యారు. ప్రదీప్‌కుమార్ ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఏడీగా పని చేస్తున్నారు. వరంగల్ ఏడీగా పని చేస్తున్న ఎం.బాలదాసు కరీంనగర్ జిల్లాలో మైనింగ్ విజిలెన్స్ విభాగం ఏడీగా బదిలీ అయ్యారు. వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా పని చేస్తున్న బి.సత్యనారాయణ నల్లగొండ విజిలెన్స్ విభాగానికి, నల్లగొండ జిల్లా విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్న పి.శ్రీనివాస్ వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా బదిలీపై రానున్నారు.
అలాగే, మిర్యాలగూడ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్.బాలు వరంగల్ డీడీ కార్యాలయంలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్.క్రాంతికుమార్ నిజామాబాద్ ఏడీ కార్యాలయానికి, మహబూబాబాబ్ విజిలెన్స్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.గంగాధరరావు ఖమ్మం ఏడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎం.సురేఖ వరంగల్ ఏడీ కార్యాలయానికి బదిలీపై వచ్చారు.
నిజామాబాద్ జిల్లాలోని డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న కె.ఆనంద్ వరంగల్‌కు, వరంగల్‌లో పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. అలాగే, వరంగల్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.విజయకుమార్ మంచిర్యాల ఏడీ కార్యాలయానికి, వరంగల్ డీడీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సీహెచ్.రామమూర్తి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏడీ కార్యాలయానికి, ఎ.నాగలక్ష్మి వరంగల్ ఏడీ కార్యాలయానికి, ఎం.డీ.రసూలొద్దీన్ కరీంనగర్ ఏడీ విజిలెన్స్‌కు, ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న సంతోష్ హైదరాబాద్‌లోని డీడీ కార్యాలయానికి, హైదరాబాద్ డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.నాగరాజు వరంగల్ డీడీ కార్యాలయానికి, కొత్తగూడెం ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.శోభారాణి వరంగల్ డీడీ కార్యాలయానికి, కరీంనగర్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న బి.ఆనంద్‌కుమార్ స్టీఫెన్‌సన్ వరంగల్ ఏడీ కార్యాలయంలో నియమితులయ్యారు.
Advertisement
Advertisement