
సాక్షి, విశాఖపట్నం: ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. తవ్వకాలపై గనులు శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 280 ఎకరాల ఎర్ర మట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రమట్టి దిబ్బల అక్రమ లే ఔట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు.
ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను ఉల్లంఘించినట్లు గుర్తించిన గనుల శాఖ.. పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ మైనింగ్ శాఖ నోటీసులో పేర్కొంది.
ఇది చదవండి: మట్టి దిబ్బలు మటాష్
Comments
Please login to add a commentAdd a comment