
తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. టన్నెల్ ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేకపోవడం ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి.
టన్నెల్ సహాయక చర్యలో ఆర్మీ, సింగరేణ రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ లు పాల్గొన్నాయన్నారు ఏజీ. ఘటన జరిగిన నాటి నుంచి 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నామని హైకోర్టు తెలిపారు సుదర్శన్ రెడ్డి. సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. ఈ పిల్ పై విచారణ ముగించింది.
కాగా, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్‌లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.
మరోవైపు.. టన్నెల్‌లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్‌లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
గత నెల 22వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు 10 రోజులుగా చేస్తున్నప్రయ త్నాలు ఇంకా ఫలించలేదు.

Comments
Please login to add a commentAdd a comment