
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో ఆర్‌ఎండీఏ జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్ కమిషరేట్‌లో జాయింట్ డైరెక్టరేట్‌గా బదిలీ చేశారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్‌కార్పోరేషన్ ఆర్‌ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు,ఇతర అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment