భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు | ACB raids on properties of Bhimavaram Municipal Commissioner | Sakshi
Sakshi News home page

భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ ఆస్తులపై ఏసీబీ దాడులు

Published Thu, Jun 22 2023 4:06 AM | Last Updated on Thu, Jun 22 2023 4:06 AM

ACB raids on properties of Bhimavaram Municipal Commissioner - Sakshi

భీమవరం(ప్రకాశం చౌక్‌): పశ్చిమగోదావరి జిల్లా భీమ­వరం మున్సిపల్‌ కమిషనర్‌ సబ్బి శివరామకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యా­దుతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సి­­పల్‌ కమిషనర్‌ ఇల్లు, కార్యాలయం, మున్సి­పల్‌ ఉద్యోగి­(ఆర్‌ఐ) కృష్ణమోహన్‌ ఇంట్లో, తణుకు, ఉండ్రాజ­వరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజ­­యవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వ­­హించారు.

ఈ సోదాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ శివరామ­కృష్ణకు సంబంధించి రూ.10 కోట్ల దాకా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తి­ం­చారు. ఏసీబీ డీఎస్పీ శ్రీని­వాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు­గోదా­వరి జిల్లా ఉండ్రాజవ­రం మం­డలం పాలంగి గ్రామ­ంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్‌ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్‌ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్‌ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపా­ర్ట్‌­మెంట్‌లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు.

అలాగే విజయవాడలో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్‌ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement