Sivaramakrishna
-
ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ
నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్ స్టోరేజీ (ఎస్ఎస్) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ పనులను గుంటూరు రూరల్ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్ చేసేందుకు రూరల్ వాటర్ సప్లయి/శానిటేషన్ గుంటూరు డివిజన్ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్ (ఆర్డబ్ల్యూఎస్) డివిజన్ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు. దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌లోని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీలు టీవీవీ ప్రతాప్ కుమార్, ఎన్.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్ఐ మూర్తి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కమిషనర్.. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు
పశ్చిమ గోదావరి : కోట్లలో అక్రమాస్తులు కూడబెట్టిన భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తింపు - చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు అంతా అవినీతే - వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తింపు - శివరామకృష్ణ ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు - ఇవాళ కూడా కొనసాగనున్న సోదాలు -
భీమవరం మున్సిపల్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ దాడులు
భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదుతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి(ఆర్ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు సంబంధించి రూ.10 కోట్ల దాకా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే విజయవాడలో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. -
ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థికి లక్ష డాలర్ల వేతనం
నూజివీడు : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యనందించాలన్న ఆశయంతో దివంగత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీల లక్ష్యం నెరవేరుతోంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2008–14లో చదివిన కుంటముక్కల శివరామకృష్ణ గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా ఏడాదికి లక్ష డాలర్ల వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన శివరామకృష్ణ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, ఆయన సతీమణి ప్రోత్సాహంతో చదువులో రాణిస్తూవచ్చాడు. అదే గ్రామంలోని లకిరెడ్డి పాపులమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో 2008లో పదో తరగతిలో 600 మార్కులకు 564 సాధించి.. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు దక్కించుకున్నాడు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ బీటెక్‌లో ఈసీఈ బ్రాంచి తీసుకుని 9.27 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. ట్రిపుల్‌ఐటీలో చదువుకునేటప్పుడే అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ముబారక్ షా పరిశోధనాపత్రాలను చదివేవాడు. దీంతో కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్‌లను ఉపయోగించి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనే అంశంపై పరిశోధనలు చేయడంతో పాటు.. ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ సైంటిఫిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌లో పరిశోధనా పత్రాన్ని సైతం ప్రచురించాడు. బీటెక్ చివరిలో క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించి హైదరాబాద్‌లో రెండున్నరేళ్లు పనిచేశాడు. టీసీఎస్‌కు అమెరికాలోని కార్నెగీ మెలాన్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం ఉండటంతో కంపూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అందులో సీటు సంపాదించి.. 2019లో పూర్తిచేశాడు. ప్రస్తుతం శివరామకృష్ణ లక్ష డాలర్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గూగుల్ ‘మౌంటెన్ వ్యూఫర్ వరల్డ్ ఐపీ టీమ్’లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో చదవడం వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నానని, ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని శివరామకృష్ణ ఉద్వేగంతో చెప్పాడు. -
నట్టి ఆరోపణలు టాలీవుడ్లో ప్రకంపనలు
-
తాడిపత్రి మునిసిపల్ కమిషనర్‌కు జాతీయ స్థాయి అవార్డులు
అనంతపురం న్యూసిటీ: తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ రెండు జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 8,9న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరిగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. బహిరంగ రహిత మలవిసర్జన, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కు బెస్ట్ ప్రాక్టీస్‌గా అవార్డును ఇవ్వనున్నారు. దీనిపై కమిషనర్ శివరామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఏడాదికి రూ 2.76 కోట్లు వస్తోందన్నారు. చెత్త తరలింపుకు రూ 2.86 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. -
హెల్మెట్ ధరించినా.. లాభం లేకపోయింది
పశ్చిమ గోదావరి జిల్లా : పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ఐ.పంగిడికి చెందిన శివరామకృష్ణ(33) దేవరపల్లి మండలం గొల్లగూడెం సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సోమవారం నైట్ డ్యూటీకి వెళ్లిన అతను ఉదయం ఆరు గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరాడు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా.. దేచెర్ల ఎర్రచెరువు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన అతను లేవబోతుండగా లారీ టైర్లు తలపై నుంచి వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయింది. అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనా ప్రదేశంలో మృతదేహం పడి ఉన్న తీరు స్థానికులను కలచివేసింది. మృతిడికి భార్య పార్వతితోపాటు 9నెలల బాబు కూడా ఉన్నాడు. అతనికి పెళ్లై రెండేళ్లయింది. తండ్రి వెంకట్రావు వికలాంగుడు. తల్లి ఉషారాణి గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో వారు విలవిలలాడిపోతున్నారు. భార్య పార్వతి తీవ్రంగా రోదిస్తోంది. హెల్మెట్ ఉన్నా.. శివరామకృష్ణ హెల్మెట్ ధరించినా.. లాభం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ఊడిపోయింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద స్థలం దేవరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోది కావడంతో ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అరాచకాలపై..ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణకు అసమ్మతి సెగ తాకు తోంది. నరసరావుపేట నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని నెరుపుతున్న వ్యవహారాలపై పార్టీ కార్యకర్తలు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారిని విస్మరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని వల్ల పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లానేతలు ఎవరూ ఆసక్తిచూపక పోవడంతో నేరుగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్, సీఎం తనయుడు నారా లోకేష్‌ను కలసి ఇక్కడి పరిస్థితులను వివరించారు. శనివారం విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ ప్రసంగించిన కొద్దిసేపటి అనంతరం వీరంతా ఆయనను కలసి విషయాలను ఏకరువు పెట్టారు. నరసరావుపేటకు చెందిన కొందరు అసమ్మతి నాయకులు కోడెల శివరామకృష్ణ చేస్తున్న అరాచకాలపై ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్య ఫిర్యాదులు ... పార్టీ మనుగడకోసం కృషిచేసిన నాయకులు, కార్యకర్తలకు పదవుల కేటాయింపులో న్యాయం జరగడం లేదని, ఆయన వైఖరిని వ్యతిరేకించిన కార్యకర్తలు, నాయకులపై వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, ఇతర పనులు చేసే విషయంలోనూ అర్హులకు న్యాయం చేయడం లేదని, పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకొంటామని కొందరు కార్యకర్తలు లోకేష్‌కు వివరించారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. బాబు వద్ద పంచాయితీ ... కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దీనికి అసమ్మతి నేతలు వారి కుటుంబసభ్యుల సహా వెళ్లనున్నట్టు నియోజకవర్గంలో వినవస్తోంది. అసమ్మతి నేతలకు తెరవెనుక మద్దతు ... కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేసిన అసమ్మతి నేతలు, కార్యకర్తలకు పార్టీలోని పెద్దలే పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ పెద్దలే అసమ్మతినేతలు, కార్యకర్తలకు విజయవాడలో లోకేష్ అపాయింట్మెంట్ ఇప్పించారని, 30వ తేదీన సీఎంతో మాట్లాడే అవకాశాన్నీ కల్పిస్తున్నట్టు పార్టీలో వినపడుతోంది. మొత్తం మీద కోడెల కుమారుడు శివరామకృష్ణ వైఖరి జిల్లా నేతల మధ్య విభేదాల పెరుగుదలకు కారణమవుతోంది. పార్టీ పెద్దలు గ్రూపులు, వర్గాలుగా విడిపోవడానికి మరింత దోహదం చేస్తున్నాయి. పెద్దల మధ్య సంబంధాలు ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ సంఘటన ఎటునుంచి ఎటువైపునకు దారి తీస్తుం దోనని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
టీడీపీ సభ్యత్వానికి 150 కుటుంబాలు రాజీనామా
రొంపిచర్ల : స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ వైఖరికి నిరసనగా రొంపిచర్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అమ్మా, బాబు అంటూ పని చేయించుకుని ఇప్పుడు తమను విస్మరిస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, చెరువు పనుల కేటాయింపుల్లో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఉండటం లేదని, ఏరుదాటిన తరువాత తెప్ప తగలేసిన రీతిలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆ పార్టీని వీడాలనే నిర్ణయానికి వస్తున్నారు. మొదటి అడుగుగా మండలంలోని సంతగుడిపాడు గ్రామానికి చెందిన సుమారు 150 కుటుంబాలకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు నలబోతు వెంకటరామయ్య ఆధ్వర్యంలో వీరంతా సమావేశమయ్యారు. పార్టీ నేతల వైఖరికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామ అభివృద్ధికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని, కనీసం సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఇటీవల మండల మహిళా అధ్యక్షురాలి నియామకాన్ని నర్మగర్భంగా ప్రస్తావిస్తూ అర్హతలేని, భాషా పరిజ్ఞానం లేని వ్యక్తులను అందలం ఎక్కిస్తున్న తీరును విమర్శించారు. దీంతో పాటు పార్టీకే చెందిన ఎస్సీ కుటుంబాలకు చెందిన 105ఎకరాల్లో చెరువు తవ్వేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజీనామా చేసిన కుటుంబాల్లో మామిళ్ళపల్లి ఆదిబాబు, వాకా రమణారెడ్డి, లగడపాటి ఆంజనేయులు, కల్లూరి ఆంజనేయులు, పాలపర్తి కోటేశ్వరరావు, బండారుపల్లి రామారావు, వర్ల వెంకయ్య తదితరులు ఉన్నారు. -
స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్
అర్ధరాత్రి భర్తే దాడి చేసి కొడుకును కిడ్నాప్ చేసినట్లు భార్య ఫిర్యాదు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు శివరామకృష్ణ బుధవారం అర్ధరాత్రి దౌర్జన్యానికి దిగారు. విశాఖపట్నం త్రీటౌన్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న తన భార్య ఇంటిపై దాడి చేశారు. నలుగురితో కలసి ఇంటి తలుపులు పగలగొట్టి అత్తమామలను బెదిరించి తన కుమారుడు గౌతమ్(4)ను కిడ్నాప్ చేసినట్టు భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009 ఆగస్టులో తనకు శివరామకృష్ణతో వివాహం జరిగిందని, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరిగాయని అందులో పేర్కొన్నారు. కోడెల భార్య, కుమార్తె కూడా తనను వేధించేవారని ఆమె ఆరోపించారు. 2010లో బాబు పుట్టిన తర్వాత కూడా తనను పలుమార్లు ఇంటి నుంచి గెంటేశారని, ఇటీవల కోడెల అధికారంలోకి వచ్చిన తర్వాత వేధింపులు అధికమయ్యాయని పద్మప్రియ పేర్కొన్నారు. దీంతో ఏడాదిగా విశాఖలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్థరాత్రి శివరామకృష్ణ తన అనుచరులతో దాడి చేసి బాబును కిడ్నాప్ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ మహేష్, త్రీటౌన్ సీఐ వెంటనే బాధితురాలి ఇంటికి వచ్చి విచారణ ప్రారంభించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
స్పీకర్ కోడెల మనవడు కిడ్నాప్
-
‘జన్ను’కు రైల్వే ఉద్యోగి దన్ను !
శివరామకృష్ణ మోసాలు మరిన్ని.... సూత్రధారి సికిందరాబాద్ వర్కు షెడ్డు ఉద్యోగి ఒక్కొక్కరి నుంచి ఐదు నుంచి రూ.12 లక్షలు వసూలు రోజు రోజుకీ పెరుగుతున్న బాధితులు పెడన : రైల్వేలో టీటీఈ పోస్టులు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రుపాయలు వసూలు చేసి పరారయిన జన్ను శివ రామకృష్ణ మోసాల వెనుక సికిందరాబాద్‌కు చెందిన రైల్వే ఉద్యోగి హస్తం ఉన్నట్లు సమాచారం. పెడన మండలం అచ్చయ్యవారి పాలెం గ్రామ పంచాయతీ శివారు జింజేరు గౌడపాలెంనకు చెందిన జన్ను శివరామకృష్ణకు రైల్వేలో ఉన్నత ఉద్యోగుల అండదండలు, పరిచయాలతోనే ఈ తంతు గుట్టు చప్పుడు కాకుండా నడిపినట్లు సమాచారం. ఉయ్యూరు మండలం ఆనందపురానికి చెందిన పర్రే సతీష్ బాబు, మల్లంపాటీ పూర్ణ కిషోర్, రమ్య ఇచ్చిన ఫిర్యాదుతో పెడన పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని మోసంచేసిన శివరామకృష్ణ భాాగోతాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. వర్కు షెడ్డులో ఉన్నతోద్యోగి హస్తం ! జన్ను శివరామకృష్ణ భీమవరంలో బీఎస్సీ వరకు చదువుకుని రైల్వేలో టీటీఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరీక్షలు రాసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతలో సికిందరాబాద్‌లోని వర్కు షెడ్డులో పనిచేసే ఓ ఉన్నతోద్యోగి పరిచయం ఏర్పడి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొంత నగదును శివరామకృష్ణ నుంచి వసూలు చేశాడు. వర్కుషెడ్డులో అప్రంటీస్ షిప్ కింద శివరామకృష్ణను చేర్చాడు. ఇదే తరహాలోమరికొంతమందికి ఉద్యోగాలిప్పించి వారినుంచి భారీమొత్తంలో గుంజాలని శివరామకృష్ణ, రైల్వే ఉద్యోగి పన్నాగం పన్నారు. రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం పడుతున్న పలు రిక్రూట్మెంటు వివరాలను తెలుసుకుని నిరుద్యోగులకు ఎర వేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో బీటెక్, డీగ్రీలు, పీజీలు చదివిన పలువురు నిరుద్యోగుల నుంచి ఆరు లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలో బంటుమిల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి శివరామకృష్ణ మోసంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సొంత బంధువులు సైతం బురిడీ... శివరామకృష్ణ భార్య వాళ్ల పెద్దమ్మ నుంచి వాళ్ల అబ్బాయికి టీటీఈ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. ఆరు లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు భీమవరం, హైదారాబాద్, బంటుమిల్లి, గుడివాడ, పెనమలూరు తదితర ప్రాంతాలకు చెందిన 40 మంది పేర్లను వెల్లడించినట్లు తెలిసింది. మరో నలుగురు బాధితుల ఫిర్యాదు... పలు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన గుడ్లవల్లేరు మండలం పురిటిపాడుకు చెందిన వీరంకి కృష్ణ మోహన్, పరిశే వీర వేంకటేశ్వరావు, బొర్రా నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఒక్కొక్కరినుంచి పది లక్షలు చొప్పున రూ. 30 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెడన మండలం నెరికేపాలేం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి నుంచి రూ.ఐదు లక్షలు తీసుకున్నట్లు మరో ఫిర్యాదు అందింది.