అనంతపురం న్యూసిటీ: తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ రెండు జాతీయస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 8,9న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరిగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. బహిరంగ రహిత మలవిసర్జన, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు బెస్ట్ ప్రాక్టీస్‌గా అవార్డును ఇవ్వనున్నారు. దీనిపై కమిషనర్ శివరామకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ఏడాదికి రూ 2.76 కోట్లు వస్తోందన్నారు. చెత్త తరలింపుకు రూ 2.86 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.