చెప్పేదొకటి..చేసేదొకటా..? | Review meeting with the municipal authorities | Sakshi
Sakshi News home page

చెప్పేదొకటి..చేసేదొకటా..?

Published Thu, Sep 18 2014 2:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

చెప్పేదొకటి..చేసేదొకటా..? - Sakshi

చెప్పేదొకటి..చేసేదొకటా..?

 శ్రీకాకుళం సిటీ : ఒకటి చెబుతూ..ఒకటి చేస్తున్నారంటూ..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం రాత్రి జెడ్పీ సమావేశ మందిరంలో మూడు జిల్లాల మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు  సు మారు 20 మున్సిపాల్టీల్లో పర్యటించానని, అం దులో శ్రీకాకుళం మున్సిపాల్టీతో సహా 15 మున్సిపాల్టీల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు.  శ్రీకాకుళంలో ప్రత్యేకాధికారికి, కమిషనర్‌కు బా గా గ్యాప్ ఉందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.  దీనిపై  విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
 
 శ్రీకాకుళంలో అనధికార లేఅవుట్లు, నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అధిక ము న్సిపాల్టీల్లో సిబ్బంది కొరత ఉందని, ఈనెలాఖరుకల్లా సిబ్బంది నియామకాలను చేపడతానని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపడాలని,  డంపింగ్ యార్డుల నిర్వహణ, చెత్త సేకరణ అంశాల్లో రాష్ట్రంలోనే సాలూరు, బొబ్బిలి మున్సిపాల్టీలు ఆదర్శంగా పనిచేస్తున్నాయని, అక్కడికి వెళ్లి అక్కడి అధికారుల పనితీరును పరిశీలించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.  ఈసమావేశంలో మున్సిపల్ శాఖ కమిషనర్ వాణీ మో హన్, ఈఎన్‌సీ పాండురంగారావు, టౌన్ ప్లా నింగ్ డైరక్టర్ తిమ్మారెడ్డి  పాల్గొన్నారు.
 
 మున్సిపల్ పాలనలో ప్రజలకు భాగస్వామ్యం
 శ్రీకాకుళం: మున్సిపల్ పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని   మంత్రి పి. నారాయణ చెప్పారు. వారం రోజుల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి వస్తుందన్నారు.  జిలా ్లకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సాఫ్ట్‌వేర్ వచ్చిన తరువాత ప్రజలు తమ సమస్యను ఫోటో తీసి తమకు అప్‌లోడ్ చేస్తే వెంటనే దానిని సంబంధిత మున్సిపాలిటీకి పంపిస్తామన్నారు. 48 గంటల్లోగా సమస్యను పరిష్కరించి.. తిరిగి ఫోటో తీసి తమకు పంపిస్తే ఆ ఫోటోను ఫిర్యాదుదారునికి పంపిస్తామని చెప్పా రు.
 
 కార్మికశాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి వేసిన పలు ప్రశ్నలకు అధికారులు సరైన జవాబు చెప్పలేకపోవడంపై  ఆవేదన వ్యక్తం చేశారు.   అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వరకు 20 నుంచి 30 శాతం పనులకే పరిమితమైన అధికారులు సీఎం వస్తుండడంతో 60 శాతం పూర్తి చేశారని..ఇదే పద్ధతి కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశం అనంతరం డం పింగ్‌యార్డును అత్యంత సుందరంగా తీర్చిదిద్ది అదే ప్రాంతంలో తన కుమార్తె వివాహం చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకునేలా పనిచేసిన సాలూరు మున్సిపల్ కమిషనర్‌ను మంత్రులు ఘనంగా సత్కరించి అభినందలు తెలియజేశారు. సమావేశంలో ఇ చ్ఛాపురం శాసనసభ్యుడు బెందాళం అశోక్, రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ వాణీమోహన్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
 
 మార్కెట్‌లో వ్యాపారుల మధ్య వాగ్వాదం
 రిమ్స్‌క్యాంపస్: మంత్రి నారాయణ పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా రెల్లి కులానికి చెందిన వ్యాపారు లు, వైశ్య కులానికి చెందిన వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  తమకు అన్యా యం చేస్తున్నారంటూ రెల్లి కులానికి చెందిన వ్యాపారులు వైశ్య కులస్థులపై ఫిర్యాదు చేశారు. అనంతరం తమ వాదన వినాలంటే..లేదు తమ వాదనే వినాలంటూ..ఇరు వర్గాలు ఒత్తిడి చేశారు. ఒక దశలో స్వల్పంగా తోపులాట జరి గింది. మార్కెట్‌లో మేడపై దుకాణాలు నిర్మిం చడం వల్ల నిరుపయోగంగా మారాయని మం త్రి దృష్టికి తెచ్చారు. షాపుల కేటాయింపులో బినామీల రాజ్యం నడుస్తోందని తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి పర్యటించారు.  ఆయనతో పాటు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ వాణీమోహన్, జాయింట్ కలెక్టర్ జి.వీరపాండ్యన్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మెప్మా పీడీ మునుకోటి సత్యనారాయణ, ప్ర ణాళికా డెరైక్టర్ సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.
 
 ఎస్సీ, ఎస్టీలకు
 రిజర్వేషన్లు అమలు చేయండి
 శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ.. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వెంకటరమణ మాదిగ మంత్రికి వినతిపత్రం అందజేశారు.  సముచిత స్థానం కల్పించాలని కోరారు.
 
 తెలగకులస్తులను బీసీల్లో చేర్చండి
 శ్రీకాకుళం అర్బన్: తెలగ కులస్తులను  బీసీ జాబితాలో చేర్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి నారాయణను శ్రీకాకుళం ము న్సిపల్ కార్యాలయంలో కలిసి..వినతిపత్రం అందజేశారు.
 
 జిల్లాల వారీగానే  నీటి నిల్వలు
 శ్రీకాకుళం సిటీ: రాష్ట్రంలో 2044 వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు పరిశ్రమలకు నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.  బుధవారం సాయంత్రం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖాధికారులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుతో కలిసి ఆ యన సమీక్షించారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..వంశధార, నాగావళి నదుల నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే.. ఇక్కడ కూడా గ్రిడ్ సక్సెస్ అవుతుందన్నారు. సమావేశంలో ప్ర భుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, మూడు జిల్లాల అధికారులు శ్రీకాకుళం ఎంపీ పాల్గొన్నారు.
 
 ఆదిత్యుని సన్నిధిలో..
 అరసవల్లి: ప్రత్యక్ష దైవం ఆరోగ్యప్రదాత అరసవల్లి  శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మం త్రి పి.నారాయణ బుధవారం దర్శించుకున్నా రు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వచనాలు పొందారు.
 
 మున్సిపల్ కార్మికులను
  రెగ్యులర్ చేయండి
 రిమ్స్‌క్యాంపస్: మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మున్సిపల్ మంత్రి నారాయణను భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బి.జి.నాయుడు కోరా రు. ఈ మేరకు  మంత్రిని  కలిసి వినతి పత్రం  అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement