రాష్ట్రంలో భారీ సంఖ్యలో మునిసిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గత మూడు రోజుల్లో నలుగురు మునిసిపల్ కమిషనర్లు బదిలీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో మునిసిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గత మూడు రోజుల్లో నలుగురు మునిసిపల్ కమిషనర్లు బదిలీ కాగా..గురువారం ఒక్క రోజే 10 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తి పన్నుల వసూళ్లు, 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పన్నుల్లో పురోగతితోపాటు వ్యక్తిగత వ్యవహార ైశె లిని పరిగణలోకి తీసుకుని ఈ బదిలీలను చేపట్టనట్లు అధికార వర్గాలు తెలిపాయి.
గత నాలుగు రోజుల్లో 14 మంది బదిలీ కాగా, వారిలో ఐదుగురు కమిషనర్లకు తదుపరి పోస్టింగ్ కేటాయించకుండా పురపాలకశాఖ డెరైక్టరేట్‌కు సరెండర్ చేయడం గమనార్హం. గతంలో హుస్నాబాద్ నగర పంచాయతీ కమిషనర్‌గా పనిచేసిన పి.ప్రభాకర్‌ను అందోల్-జోగిపేట కమిషనర్‌గా బదిలీ చేస్తూ పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. మునిసిపల్ కమిషనర్ల బదిలీలు ఇలా ఉన్నాయి.