వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు.
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణ మునిసిపల్ కమిషనర్‌పై మహిళా ఉద్యోగులు శుక్రవారం దాడి చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎ.శంకరరావు కొంత కాలంగా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీపీఐ నాయకులతో కలసి ఉద్యోగినులు కమిషనర్‌ను ఆయన చాంబర్ నుంచి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. కాగా, సెలవుపై వెళ్లిపోవాలని కమిషనర్‌ను పురపాలక సంఘం చైర్మన్ పార్థసారధి కోరారు.