♦ రూ.50 వేలు తీసుకుంటూ దొరికాడు
♦ ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం
♦ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ఓంజీ
♦ ఏసీబీ కోర్టుకు కమిషనర్ తరలింపు
మున్సిపల్ కమిషనర్ రాజలింగు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మానుకోటకు చెందిన ఓంజీ తన ఇంటి నిర్మాణం అనుమతి విషయంలో రాజలింగును కలిశాడు.. రూ.1.50 లక్షలు ఇస్తే అనుమతి ఇస్తానని తెలిపాడు. ఓంజీ ఏసీబీ అధికారులను ఆశ్రరుుంచాడు. పక్కా ప్రణాళికతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఓంజీ నుంచి రూ.50 వేలు కమిషనర్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.
మహబూబాబాద్ : ఏసీబీ వలకు పెద్ద చేప చిక్కింది. మానుకోటకు చెందిన ఓ వ్యక్తి వద్ద ఇంటి నిర్మాణ అనుమతి విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ మునిసిపల్ కమిషనర్ రాజలింగు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు. కొన్నాళ్లుగా ఈయన అవినీతి వ్యవహారంపై పట్టణంలో చర్చ సాగుతున్నప్పటికీ.. ఈ ఘటనతో అతడి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన భూక్య ఓంజీ నాయక్ పట్టణ శివారు కురవి రోడ్డు సర్వే నంబర్ 307/2లో 240 గజాల స్థలంలో 3 గదుల నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రెండేళ్లుగా మునిసిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
అరుుతే అధికారులు మాత్రం ఆ స్థలం ఎఫ్‌టీఎల్‌లో ఉందని, అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఓంజీ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లతో హైకోర్టును ఆశ్రయించాడు. అందుకు హైకోర్టు నుంచి సంబంధిత అధికారులకు నోటీసులు వచ్చాయి. దీంతో మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగు, టీపీఓ ఖుర్షిద్ ఒత్తిడి మేరకు అతడు కోర్టులో కేసు విత్‌డ్రా చేసుకున్నాడు. హైకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామన్న మునిసిపల్ అధికారుల హామీతోఓంజీ ఆరు నెలల క్రితం ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. స్లాబ్ వరకు భవనం నిర్మాణం జరిగింది. అరుుతే అధికారులు మాట తప్పి మళ్లీ పనులు నిలిపివేయడంతో అతడు కమిషనర్‌ను కలిశాడు.
ఆయన రూ.30 వేలు డిమాండ్ చేయగా, వెంటనే రూ.25 వేలు ఇచ్చాడు. పనులు మొదలు పెట్టిన కొద్దిరోజులకే మళ్లీ అధికారులు వచ్చి ఆపేశారు. అదే రోడ్డులో మరో వ్యక్తి ఇంటి అనుమతి కోసం లక్షా 50 వేలు ఇచ్చాడని, నువ్వు కూడా అంతే ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో రూ.75 వేలు తీసుకొని రమ్మని గురువారం ఓంజీకి చెప్పాడు. గత రెండేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న ఓంజీ విసిగి వేసారి చివరికి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కమిషనర్ చెప్పిన విధంగానే శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు డబ్బులు తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు.
అప్పుడు జనం ఉండడంతో కమిషనర్ సూచన మేరకు 10 నిమిషాలు ఆగి మళ్లీ వెళ్లాడు. ఒంటరిగా ఉన్న కమిషనర్‌కు డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులను కమిషనర్ తన టేబుల్ డెస్కులో వేసుకోగానే అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ సాయిబాబా, సీఐలు రాఘవేందర్‌రావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఆ చాంబర్‌లోకి వెళ్లి ఆ డెస్కులోని డబ్బులను తీసి కమిషనర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమిషనర్ రాజలింగుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఓంజీ దరఖాస్తు చేసుకున్న పత్రాలు, ఆఫీసులోని ఇతరత్రా రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయంలో తని ఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే కమిషనర్ మానుకోటలో అద్దెకు ఉంటున్న ఇంట్లో, ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఆయన నివాస గృహంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. కమిషనర్ దగ్గరి నుంచి రూ.50 వేలు రికవరీ చేశామని, ఆయనను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సారుుబాబా తెలిపారు.
నిజమైన ఆరోపణలు..
కొంతకాలంగా మునిసిపల్ కమిషనర్ టి.రాజలింగుపై సీపీఎం పలు ఆరోపణలు చేస్తోంది. కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నాడని, లక్షలాది రూపాయలు గడించాడని విలేకరుల సమావేశంలోనూ వెల్లడించారు. కొంతకాలంగా మునిసిపాలిటి అవినీతిపై జరుగుతున్న ప్రచారానికి నేడు ఏసీబీ దాడుల్లో కమిషనర్ చిక్కడంతో తెరపడినట్లయింది. కాగా రాజలింగు 2014, ఫిబ్రవరిలో మునిసిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఏసీబీకి చిక్కిన మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజలింగు
Published Sat, Apr 11 2015 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement