సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు కలెక్టరేట్ : నగరాల్లోని దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండేలా అమలుచేయాలని మాతృభాషా దినోత్సవం రోజున ఆదేశిస్తే ఇప్పటివరకు ఎందుకు ఆచరించలేదని మునిసిపల్ కమిషనర్లపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో మునిసిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ నగరాల్లో తెలుగులో దుకాణాల బోర్డులు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మునిసిపాలిటీ పోస్టర్ ఫ్రీ (పోస్టర్లు ఉండని) సిటీగా తయారయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వీధి విక్రయదారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులను అందజేసి సంఘాలుగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 20న వీధి విక్రయదారులకు రుణమేళా నిర్వహించి రూ.5కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వైన్‌ఫ్లూ నివారణకు రెండు రోజుల్లోగా ఇంటింటికీ హోమియో మం దులు పంపి ణీ చేయాలని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు.
ఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించండి
నగరాల్లో మాఇంటి కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించేలా కమిషనర్లు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఖాళీ స్థలాల్లో కూరగాయల తోటలు పెంచుకునే విధంగా నగర ప్రజల ను ప్రోత్సహించాలన్నారు. ఇంటికూరగాయల్లో 70 శాతం పోషకాలుంటాయనే విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. మలనాడు గిద్దలు సంప్రదాయ ఆవులని, అవి కర్ణాటక లోని షిమోగా ప్రాంతానివని చెప్పారు. ఆవు ధర రూ.18 వేలని, పాలు రోజుకు 2 నుంచి 3 లీటర్లు ఇస్తాయని తెలిపారు.
ఈ పాలు చాలా ఆరోగ్యవంతమైనవని, రోగనిరోధకమని చె ప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతిలో పేదల కోసం నిర్మించిన గృహాలకు ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపికచేయాలన్నా రు. జిల్లాలో రాత్రి బస గృహాలు మదనపల్లెలో ఈ నెల 20కి, శ్రీకాళహస్తిలో ఈ నెల 12న, నగరి, చిత్తూరులో ఈనెలాఖరుకు పనులు పూర్తిచేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. జేసీ–2 చంద్రమౌళి, చిత్తూ రు నగర కమిషనర్ ఓబులేసు, తిరుపతి నగర పాల క డెప్యూటీ కమిషనర్ పణిరామ్, శ్రీకాళహస్తి, పుంగనూరు మునిపల్ కమిషనర్లు రమేష్‌బాబు, వర్మ, మెప్మా పీడీ జ్యోతి, మెప్మా సిటీ మిషన్ మేనేజర్లు గోపి, మధుసూదన్‌రెడ్డి, పెంచలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment