
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై స్పందించని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బీసీ హాస్టల్ భవన నిర్మాణం కోసం 1975లో కేటాయిం చిన స్థలంలో ఆదిలాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా మున్సిపల్ కమిషనర్ చర్య లు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన గొట్టిముక్క ల వీఆర్‌ఆర్‌జీ రాజు వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని గురువారం హైకోర్టు విచారించింది. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment