ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. దాంతో ఇరువురి అంతర్గత విభేదాలతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సెలవుల్లో పంపాలని ఆయన రీజనల్ జాయింట్ డైరెక్టర్ కి లేఖ రాశారు. మున్సిపల్ కమిషనర్ బాటలోనే ఇతర ఉద్యోగులు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా మున్సిపల్ సమావేశంలో మంగళవారం సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది. చైర్పర్సన్ ఆదేశాల మేరకు కమిషనర్ మల్లారెడ్డి...అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీతారాణి నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కార్యాలయానికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలు అధికారులకు తలనొప్పిగా మారాయి.
మమ్మల్ని సెలవుల్లో పంపండి...
Published Wed, Jul 16 2014 10:28 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement