
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్‌ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్)
ఎస్‌ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్‌ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
ఎస్‌ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.