Kanagaraj
-
జస్టిస్ కనగరాజ్ నియామక ఉత్తర్వుల అమలు నిలిపివేత
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు 4 వారాల పాటునిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్లతో పాటు జస్టిస్ కనగరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లదంటూ న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. జస్టిస్ కనగరాజ్ వయసు 78 సంవత్సరాలని, చట్ట ప్రకారం చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి 65 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు వీలుందని తెలిపారు. వయసురీత్యా జస్టిస్ కనగరాజ్ నియామకం చట్ట నిబంధనలకు విరుద్దమని ఆయన వివరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన ప్యానల్ నుంచి చైర్మన్ నియామకం జరగాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మానం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే వయసు రీత్యా జస్టిస్ కనగరాజ్ నియామకం చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అందువల్ల ఆయన నియామక ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నామని స్పష్టం చేసింది. -
సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్ వి.కనగరాజ్
సాక్షి, అమరావతి: జస్టిస్ వి.కనగరాజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనగరాజ్ వైఎస్ జగన్‌కు పుష్పగుచ్చం అందించి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా జస్టిస్ వి.కనగరాజ్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోస్టులు కలిగిన అధికారులపై వచ్చే ఫిర్యాదులపై ఈ అథారిటీ విచారణ చేపడుతుంది. -
రామ్‌చరణ్‌తో సినిమా..ఆ డైరెక్టర్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన 'మైత్రీ'
వరుస విజయాలతో జోరు మీదున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజు త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోతో ఓ సినిమా చేయనున్నాడట. కార్తీ నటించిన “ఖైదీ” చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తమిళంలో కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ డైరెక్టర్‌తో పనిచేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా తలపతి విజయ్‌తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఫోకస్ మన తెలుగు హీరోలపై పడిందట. రంగస్థలంతో తన నట విశ్వరూపాన్ని చూపించిన రామ్‌చరణ్‌తో కనగరాజు ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై రామ్‌చరణ్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని, దీన్ని తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపస్తోంది. ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. ఇప్పటికే డైరెక్టర్ కనగరాజుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. చదవండి : శంకర్-రామ్‌చరణ్ సినిమా మరింత ఆలస్యం కానుందా? Liger Movie: ఆసక్తిరేపుతున్న క్రైమాక్స్ సీన్ అప్డేట్! -
ఎన్నికల కమిషనర్ ‘ఆర్డినెన్స్’ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేసింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా రద్దుచేసింది. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పదవీ కాలం పూర్తయ్యే వరకు రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనివ్వాలని చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 200 ప్రకారం నియమితులైన ఎన్నికల కమిషనర్ మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అన్ని ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ, ఓటర్ల జాబితా తయారీపై నియంత్రణ, మార్గదర్శకత్వం చేయజాలరని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 2 (39), సెక్షన్ 2(40), సెక్షన్ 200లోని నిబంధనలను ప్రభుత్వం ఓసారి పున:పరిశీలన చేయాలని, వీటి విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్, కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావులతో పాటు మరికొందరు వేర్వేరుగా 13 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం 332 పేజీల తీర్పు వెలువరించింది. ఈ ఆర్డినెన్స్, జీఓలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగాలేవని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం సర్వీసు నిబంధనల్లో భాగం కాదని.. ఆర్డినెన్స్ ద్వారా దానిని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చేంత అత్యవసర పరిస్థితులేవీ లేవని.. ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని హైకోర్టు గుర్తుచేసింది. ఆర్డినెన్స్ జారీచేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. అయితే, ప్రస్తుత కేసులో జారీచేసిన ఆర్డినెన్స్ మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగా లేదని ధర్మాసనం పేర్కొంది. సర్వీసు నిబంధనలు పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే,ఎస్ఈసీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు, అర్హతలను నిర్ణయించి మంత్రిమండలి సిఫార్సుల మేరకు ఆర్డినెన్స్ ద్వారా నియమించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించే విచాక్షణాధికారం రాజ్యాంగంలోని అధికరణ 243కే (1) ప్రకారం గవర్నర్‌కు ఉందని తెలిపింది. సుప్రీంకోర్టుకెళ్తాం.. తీర్పు అమలును నిలిపేయండి ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు అమలును నిలుపుదల చేయని పక్షంలో తమ న్యాయ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిన వెంటనే, తీర్పు అమలుపై స్టే గురించి అడ్వకేట్ జనరల్ ప్రసావించేందుకు సిద్ధమవుతుండగా, వెబ్ కాన్ఫరెన్స్ కనెక్షన్ కట్ అయిందని తెలిపింది. ఈలోపు ధర్మాసనం తన కోర్టు ప్రొసీడింగ్స్‌ను ముగించిందని పేర్కొంది. సీపీసీ నిబంధనల ప్రకారం తీర్పు అమలుపై స్టే విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్‌ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఎస్ఈసీగా రమేష్‌కుమార్ బాధ్యతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తాను తిరిగి బాధ్యతల్లో చేరినట్లు పేర్కొంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో శుక్రవారం సాయంత్రం సర్కులర్ జారీ చేశారు. -
అనుకూల పరిస్థితులు తర్వాతే నిర్ణయం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంతవరకూ వాయిదా కొనసాగుతుందని ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తెలిపారు. కాగా కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ హైకోర్టుకు నివేదించారు. తననే లక్ష్యంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసిందన్న నిమ్మగడ్డ ఆరోపణల్లో వాస్తవంలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ఏ చట్టం చేసినా అది కమిషనర్‌కే వర్తిస్తుందని, అలాంటప్పుడు దానిని ఓ వ్యక్తి లక్ష్యంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌గా చెప్పడానికి వీల్లేదన్నారు. గవర్నర్‌కు దురుద్దేశాలు అంటగట్టడం, ఆయన వివేచనను ప్రశ్నించడం వంటివి చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యాజ్యం దాఖలు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆయన కౌంటర్లోని ముఖ్యాంశాలు.. ► బాధిత వ్యక్తిగా నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, ఇదే అంశంపై మిగిలిన వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్ పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదు. ఇటువంటి వ్యాజ్యాలపై సాధారణంగా హైకోర్టు విచారణ చేపట్టదు. ► ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాల పరిమితిని సవరిస్తూ ఏప్రిల్ 10న ప్రభుత్వం జారీచేసిన జీఓ 617 వల్ల ఎన్నికల కమిషనర్‌గా సర్వీసు నిలిచిపోయిందని నిమ్మగడ్డ రమేశ్ చెబుతున్నారు. వాస్తవానికి ఇది తప్పు. ► ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లోని క్లాజ్ 5 ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వ్యక్తి సర్వీసు నిలిచిపోతుంది. అంతే తప్ప జీఓ 617 వల్ల కాదు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చేసే ఏ చట్టమైనా ఎన్నికల కమిషనర్‌ను ఉద్దేశించే చేయబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకునే ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిందన్న నిమ్మగడ్డ వాదన అర్థరహితం. ► అలాగే, గవర్నర్‌కు దురుద్దేశాలు అంటగట్టడానికి వీల్లేదు. ఆయన వివేచనను కూడా ప్రశ్నించజాలరు. ఆ పిటిషన్ మొత్తం కాపీ పేస్టే.. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డకు మద్దతుగా మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌లోని 13 పేరాలను కామినేని యథాతథంగా తన పిటిషన్లో వాడారు. నిమ్మగడ్డ ఏప్రిల్ 11న కామినేని ఏప్రిల్ 12న పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బట్టి నిమ్మగడ్డ రమేశ్ తన పిటిషన్‌ను కామినేని శ్రీనివాస్‌కు పంపారని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక.. కామినేని తన వృత్తిని మెడికల్ ప్రాక్టీషనర్‌గా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీగా పిటిషన్లో పేర్కొన్నారు. ఇది కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే. ఫిర్యాదులు పరిశీలించి విచారణ జరపాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 54,594 నామినేషన్లు వచ్చాయి. ఈ స్థానాల విషయంలో వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.078 శాతం మాత్రమే. అలాగే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 15,185 నామినేషన్లు వచ్చాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.092 శాతం మాత్రమేనని జస్టిస్ వి.కనగరాజ్ తన కౌంటర్లో ప్రస్తావించారు. అంతేకాక.. ► ఫిర్యాదులన్నింటినీ కలిపి చూడకుండా, ఆ ఫిర్యాదులు ఏమిటో పరిశీలించి, వాటిపై విచారణ జరిపితేనే వాటిలో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుంది. ► మార్చి 15కు ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు, సలహాలు జారీచేయలేదు. అయినప్పటికీ అదేరోజు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ► దీనిని బట్టి ఎన్నికల కమిషనర్‌గా ఆయన ఎటువంటి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టలేదని అర్థమవుతోంది. కాబట్టి ఆయన నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. ► ఎన్నికల కమిషనర్‌గా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని నిమ్మగడ్డ చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవంలేదు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరపడమే ఈ ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశం. ► ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం నేను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతున్నా. ► వాస్తవానికి ఏ చట్టాన్నైనా తెచ్చే శాసనపరమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిని ఎవ్వరూ తప్పుపట్టజాలరు. ఈ విషయంలో పిటిషనర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ► నిమ్మగడ్డ రమేశ్‌నే ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు లేదా ఇతర ఏ కోర్టు కూడా ఎక్కడా చెప్పలేదు. ► ఇక వడ్డే శోభనాద్రీశ్వరరావు, గండూరు మహేశ్‌లు తమ వ్యాజ్యాల్లో నిమ్మగడ్డ రమేశ్ తనకు రక్షణ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటూ ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నోట్ ఫైళ్లు లేవు. ఎవరినీ సంప్రదించక్కర్లేదు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే విషయంలో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరంలేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల సంఘం కార్యదర్శితో కూడా మాట్లాడాల్సిన అవసరంలేదని తన రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైనదని తెలిపారు. తన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వాధికారులతో సంప్రదించలేదని చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్‌రెడ్డిలు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు నిమ్మగడ్డ తిరుగు సమాధానాలు (రిప్లై కౌంటర్) ఇచ్చారు. -
నిమ్మగడ్డ పిటిషన్‌పై జస్టిస్ కనగరాజ్ కౌంటర్ దాఖలు
సాక్షి, అమరావతి : నిమ్మగడ్డ రమేష్ పిటిషన్‌పై హైకోర్టులో ఏపీ నూతన ఎస్ఈసీ, జస్టిస్ కనగరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిల్‌తో పాటు దాఖలైన 12 పిల్స్‌కు ఒకే కౌంటర్ దాఖలు చేశారు. ఓటరు, అభ్యర్థి కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కు మినహా మిగతా ఎవరికీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ కోర్టుకు తెలిపారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను పిటిషనర్లు ప్రశ్నించలేరని కౌంటర్ పిటిషన్లో కనగరాజ్ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్‌కు అన్ని అధికారాలున్నాయని స్పష్టం చేశారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారు, ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదన్నారు. నిమ్మగడ్డ పిటిషన్‌లోని పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని గుర్తు చేశారు. -
నిర్ణయాలు తీసుకోకుండా.. కమిషనర్‌ను నిలువరించలేం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కనగరాజ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ప్రస్తుతం అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 16 కల్లా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్లను ఆదేశించింది. 17వ తేదీ నాటికి ప్రతివాదుల కౌంటర్లకు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు వ్యాజ్యాలు దాఖలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్, జీఓను జారీచేసింది. ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‌ను నియమిస్తూ కూడా ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాలు చేస్తూ నిమ్మగడ్డతో పాటు పలువురు టీడీపీ, బీజేపీ నేతలు, మరికొందరు మొత్తం ఏడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. నిమ్మగడ్డ తరఫున డీవీ సీతారామమూర్తి, ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్‌లు హాజరయ్యారు. -
కార్యాలయ సిబ్బందితో ఎస్ఈసీ సమావేశం
సాక్షి, విజయవాడ: ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఏపీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని ఎన్నికల కమిషనర్‌కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల నిర్వహణకు సమయానుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు. -
ఎస్ఈసీపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్‌పై టీడీపీ తన అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో నీచ రాజకీయాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌కు మతం రంగు పులుముతూ తప్పుడు ఫోటోలను వైరల్ చేస్తోంది. ఓ చర్చి పాస్టర్ ఫొటోను.. ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ఫొటోగా పేర్కొంటూ దుష్ప్రచారానికి దిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైంది జస్టిస్ వి.కనగరాజ్ అయితే ఆయన స్థానంలో క్రిస్టియన్ పాస్టర్ జె.కనకరాజ్ అనే వ్యక్తిని చూపించి మతం పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోంది. గత రెండు రోజులుగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ తప్పుడు ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలోనే.. టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ దుష్ప్రచారం కొనసాగుతోందని తెలుస్తోంది. మతం పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఆదివారమూ విధులకు హాజరైన కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు. సోమవారం కార్యాలయ అధికారులు, అన్ని స్థాయిల ఉద్యోగులతో కమిషనర్ సమావేశమవుతారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ కారణంగా మార్చి 23వ తేదీ నుంచి కార్యాలయ అధికారులు, ఉద్యోగులలో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరూ సోమవారం కార్యాలయంలో తమ విధులకు హాజరుకానున్నారు. -
ఎన్నికల సంఘం కమిషనర్‌పై నీచరాజకీయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ జస్టిస్ కనగరాజ్‌పై పచ్చ పార్టీ అనుకూల సోషల్ మీడియా నీచ రాజకీయానికి దిగింది. మతం పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోంది. దళిత రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను అవమానించేలా.. హిందువుని క్రిస్టియన్‌గా చూపిస్తూ తప్పుడు ఫోటోలతో సర్క్యూలేషన్ చేస్తోంది. ఓ చర్చి ఫాదర్ ఫోటోను ఎన్నికల సంఘం కమిషనర్ ఫోటోగా పెట్టి దుష్ప్రచారానికి దిగింది. రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టింగ్‌లు పెడుతోంది. పచ్చ పార్టీ అనుకూల సోషల్ మీడియా అబద్దపు ప్రచారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తన ఛాంబర్‌కే పరిమితమయ్యారు. -
ఏపీ కొత్త 'ఎస్ఈసీ'
-
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్ నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టులో తొమ్మిదేళ్లపాటు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలు, పదవీ కాలంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. తాజా ఆర్డినెన్స్‌కు అనుగుణంగా శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జస్టిస్ కనగరాజ్ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినట్టు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్నికల కమిషనర్‌తో పలువురి భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కనగరాజ్ విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు వేర్వేరుగా కలిశారు. కనగరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ విజయ్‌కుమార్ కూడా కలిసి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత ఎన్నికల స్థితిపై చర్చించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ రికార్డు స్థాయిలో తీర్పులు ► తమిళనాడులోని సేలం, చెన్నైల్లో విద్యాభ్యాసం. 1972లో మద్రాస్ లా కాలేజీ నుంచి లా ఉత్తీర్ణత. ► 1973లో లాయర్‌గా ప్రాక్టీస్. ► 24 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశాక 1997 ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు. ► తొమ్మిదేళ్లల్లో రికార్డు స్థాయిలో 69 వేల కేసులకు తీర్పులు. వీటిలో కీలకమైన 1,010 తీర్పులు లా జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ► 2002–05 మధ్య అంబేద్కర్ లా వర్సిటీ సెనేట్ మెంబర్‌గా పనిచేశారు. ► 2006 జనవరిలో జడ్జిగా పదవీ విరమణ. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టీస్. -
ఎస్ఈసీతో మున్సిపల్ కమిషనర్, డీజీపీ భేటీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను శనివారం మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల యథాతథ స్థితిపై ఎస్ఈసీకి నివేదించారు. నగర పాలకసంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత స్థితి గురించి ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంపై నివేదికను అందజేశారు. (ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్) ఎస్ఈసీని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ కనగరాజ్‌ను డీజీపీ గౌతమ్ గౌతం సవాంగ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్ఈసీతో సుమారు అరగంట పాటు భేటీ అయిన డీజీపీ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఎస్ఈసీ కనగరాజ్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. -
నూతన ఎస్ఈసీని కలిసిన డీజీపీ
-
‘నిమ్మగడ్డ రమేష్ ఒక్కరే ఆ స్థానానికి పనికొస్తారా?’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నియమితులైన జస్టిస్ కనగరాజ్ సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేశారని, న్యాయకోవిదుడు ఎస్ఈసీ స్థానంలో ఉంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయగలరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వ్యవస్థను బలోపేతం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ కనగరాజ్ గతంలో మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారని అంబటి తెలిపారు. 9 ఏళ్లు జడ్జిగా జస్టిస్ కనగరాజ్ కీలక తీర్పులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా అనుసరించాయన్నారు. సామాన్య దళిత కుటుంబం నుంచి హైకోర్టు జడ్జిగా ఎదిగిన వ్యక్తి జస్టిస్ కనగరాజ్ అని కొనియాడారు. దళితుడు, న్యాయకోవిదుడు ఎస్ఈసీ స్థానానికి పనికిరారా? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ ఒక్కరే ఆ స్థానానికి పనికొస్తారా? అని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు.(ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్) ‘నిమ్మగడ్డ రమేష్‌కి జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు. అందుకు ఆయన కేంద్రానికి రాసిన లేఖే నిదర్శనం. జడ్జి స్థానంలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారు? 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు? వ్యవస్థలపై చంద్రబాబుకు గౌరవం లేదు. వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు శాశ్వతం. కరోనా నియంత్రణకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఐదు ఏళ్ళు ఉండేలా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎన్నికల కమిషనర్‌గా ఉండేలా చట్టం ఉండేది. ఐఏఎస్‌లు రాజకీయ నాయకుల దగ్గర పని చేసి ఉంటారు కాబట్టి నిష్పక్షపాతంగా పని చేయలేరు. రిటైర్డ్ ఐఏఎస్ కంటే రిటైర్డ్ జడ్డి అయితే బాగుంటుందనే అభిప్రాయంతో సంస్కరణలు చేశారు. గతంలో ఐదేళ్లు ఉండే పదవి కాలాన్ని మూడేళ్లు ఉండేలా చట్టం తెచ్చారు. కొత్తగా తెచ్చిన చట్టంతో నిమ్మగడ్డ రమేష్ పదవి కాలం ముగిసింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనకరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం నియమించింది. దళితులను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే టెర్రిస్టు రాజ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేస్తున్నారు. రిఫరీగా ఉండాల్సిన నిమ్మగడ్డ రమేష్ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అంటూ లేఖలు రాస్తారా? కరోనా మీద దృష్టి పెడుతూనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. బీజేపీకి పట్టిన పచ్చ చీడ కన్నా లక్ష్మీనారాయణ. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత కన్నాకు లేదు. కన్నా గత చరిత్ర మర్చిపోకుడదు. సీపీఐని చంద్రబాబు జేబు సంస్థగా రామకృష్ణ చేశారు’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్
-
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్‌ను ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్‌గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్‌గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. (చదవండి: రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి) మర్యాద పూర్వక భేటీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన సందర్భంగా జస్టిస్ కనగరాజ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
పేపర్ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్ ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్, ఏకే బోస్ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్) కరుణానిధి (తిరువారూర్), కనగరాజ్ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కాగా, మరొకరు డీఎంకే చీఫ్. ఎమ్మెల్యే కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 22 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 39 లోక్‌సభ స్థానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాలతో ఏర్పడ్డ ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. -
ఏఐఏడీఎంకే నేత దారుణ హత్య
-
ఏఐఏడీఎంకే నేత దారుణ హత్య
చెన్నై: ఏఐఏడీఎంకేలో శశికళ వర్గానికి చెందిన ఓ నేతను ముగ్గురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అందరూ చూస్తుండగానే హత్య చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియోను పోలీసులు విడుదల చేశారు. తిరువన్నామలై జిల్లాలో జరిగిన ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపింది. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన తిరువన్నామలై నగర మాజీ సెక్రటరీ, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ వి.కనకరాజ్(40)ను ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. కనకరాజ్ మృతిపట్ల ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు శశికళ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం అక్కడ సీసీటీవీని పరిశీలించగా హత్య దృశ్యాలు కనిపించాయి. హత్య చేసింది తామే అంటూ ముగ్గురు నిందితులు (డీఎంకేకు చెందిన కార్యకర్తలు) బాబు(28), రాజా(35), శరవణన్(30) పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆర్థిక పరమైన అంశాల్లో తేడా రావడంతోనే నిందితులు హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.