![Andhra Pradesh local body election process postponed again By SEC - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/6/local-body-election.jpg.webp?itok=HnAyFe3D)
(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదాను పొడిగిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీని తిరిగి ప్రకటించేంతవరకూ వాయిదా కొనసాగుతుందని ఈ మేరకు బుధవారం ప్రకటన చేసింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తెలిపారు. కాగా కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment