
సాక్షి, అమరావతి : నిమ్మగడ్డ రమేష్ పిటిషన్‌పై హైకోర్టులో ఏపీ నూతన ఎస్ఈసీ, జస్టిస్ కనగరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిల్‌తో పాటు దాఖలైన 12 పిల్స్‌కు ఒకే కౌంటర్ దాఖలు చేశారు. ఓటరు, అభ్యర్థి కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కు మినహా మిగతా ఎవరికీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ కోర్టుకు తెలిపారు.
గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను పిటిషనర్లు ప్రశ్నించలేరని కౌంటర్ పిటిషన్‌లో కనగరాజ్ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రహస్యమన్న నిమ్మగడ్డ వాదనలో పసలేదన్నారు. ఎన్నికల కమిషనర్ నియామకానికి గవర్నర్‌కు అన్ని అధికారాలున్నాయని స్పష్టం చేశారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ పదవి కోల్పోయారు, ఆయన్ను ప్రభుత్వం తొలగించలేదన్నారు. నిమ్మగడ్డ పిటిషన్‌లోని పేరాలకు పేరాలు ఇతర పిటిషనర్లు కాపీ కొట్టారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment