
సాక్షి, విజయవాడ: గతంలో చంద్రబాబు కాపులను రౌడీలని అనలేదా? అంటూ ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌కు దేవుడు. చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారంటూ దుయ్యబట్టారు.
‘‘చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు’’ పోసాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్‌ను చంపేశారు. చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు. రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు లొంగదీసుకున్నారు’’ అని పోసాని కృష్ణమురళీ నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment