CDMA
-
ఇక పైకప్పులన్నీ కూల్కూల్గానే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల ఒకటోతేదీ నుంచి అమలులోకి వ చ్చిన కూల్‌రూఫ్ పాలసీని రాబోయే ఐదేళ్లలో 300 చదరపు కిలోమీటర్ల మేర అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పైకప్పుల కంటే కూల్ రూఫ్ సూర్యుడి నుంచి తక్కువ వేడిని తీసుకుంటుంది. ఇది సూర్యరశ్మి తీవ్రతను తగ్గించడం ద్వారా, థర్మల్ రేడియేషన్‌ను విడుదల చేసి, వేడిని తగ్గిస్తుంది. సాధారణ పైకప్పులు 20 శాతం సూర్యరశ్మిని మాత్రమే తిరిగి ప్రతిబింబిస్తే, కూల్ రూఫ్‌లు దాదాపు 80 శాతం సూర్యరశ్మిని రిఫ్లెక్ట్ చేస్తాయి. తద్వారా కూల్రూఫ్లతో భవనాలు గణనీయంగా చల్లబడతాయి. ఈ కూల్‌రూఫ్ విధానాన్ని 2023–24లో జీహెచ్ఎంసీలో 5 చ.కి.మీ మేర... మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 2.675 చ.కిమీల మేర అమలు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాల్లో ఈ సంవత్సరం కూల్‌రూఫ్ పాలసీ అమలుకు సంబంధించిన విధి విధానాలను, విస్తీర్ణం వివరాలతో సీడీఎంఏ ఎన్. సత్యనారాయణ శనివారం ఒక సర్క్యులర్ విడుదల చేశారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 3,468 వార్డుల్లో తొలి ఏడాది ఇంటి పైకప్పులను చల్లబరిచే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2.675 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 287.9 లక్షల చదరపు అడుగుల మేర ఇంటి పైకప్పులను కూల్‌రూఫ్ పాలసీ కిందికి తీసుకురానున్నారు. ఏ ఇళ్లకు కూల్‌రూఫ్ విధానం తప్పనిసరంటే... 600 చదరపు గజాలు, అంతకు పైబడిన స్థలాల్లో నిర్మించే గృహ నిర్మాణాల అనుమతులకు ఇక నుంచి కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. ఈ విస్తీర్ణంలో కూల్‌రూఫ్ విధానంలో నిర్మించిన వాటికి మాత్రమే పురపాలక శాఖ ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ ఇవ్వనుంది. ఇక అన్ని ప్రభుత్వ భవనాలు కూల్ రూఫ్ విధానంలోనే నిర్మాణం జరగాలి. సైట్ ఏరియా, బిల్డప్ ఏరియాతో సంబంధం లేకుండా అన్ని రకాల నివాసేతర, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ పాలసీ తప్పనిసరి. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ ఇదే విధానంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇక 600 చదరపు గజాలకన్నా తక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస గృహాలకు కూల్‌రూఫ్ పాలసీ ఆప్షన్‌గా ఉంటుంది. అంటే కూల్ రూఫ్ విధానంలో నిర్మించకపోయినా, అనుమతులకు ఇబ్బందులేం ఉండవు. ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న వారు సైతం శీతలీకరణ కోసం కూల్‌రూఫ్ విధానంలోకి మారే ఆప్షన్ ఉంటుంది. వచ్చే మూడేళ్లలో నివాసేతర గృహాలకు రెట్రా ఫిట్టింగ్ చేసుకోవడం కూడా ఆప్షన్‌గా సీడీఎంఏ పేర్కొంది. పాత ఇళ్లకు కూల్‌రూఫ్ ఎలా..? ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న నివాసాలను కూడా కూల్‌రూఫ్ విధానంలోకి తీసుకువచ్చేలా విధివిధానాలను రూపొందించారు. ఇందుకోసం ఆయా మునిసిపాలిటీల్లోని వార్డుల్లో నిర్దేశించిన విస్తీర్ణానికి అనుగుణంగా ఆయా ఇళ్లకు కూల్రూఫ్ను తప్పనిసరి చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయనుంది. ఆయా ఇళ్ల పైకప్పులకు సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ చేస్తారు. తెల్లటి టైల్స్‌తో లేదా తెల్లటి పొరతో పైకప్పులను కప్పి పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించాలనేది నిర్ణయం. -
వ్యక్తిపూజకు నేను దూరం: కేటీఆర్
హైదరాబాద్/బెల్లంపల్లి: ‘రాజకీయాల్లోకానీ, పాలనలో కానీ వ్యక్తిపూజను ప్రోత్సహించేవారిలో నేను చివరి వ్యక్తిని. నా జన్మదిన వేడుకలకు హాజరుకాలేదంటూ అత్యుత్సాహం కలిగిన ఓ మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులకు మెమో జారీ చేసిన వార్త నా దృష్టికి వచ్చింది. అసంబద్ధ వైఖరి ప్రదర్శించిన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్(సీడీఎంఏ)ను ఆదేశించా’ అని కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ఈ నెల 24న కేటీఆర్ బర్త్‌డే వేడుకలకు హాజరుకాలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ నలుగురు సిబ్బందికి మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. మెమోల జారీపై ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో ట్విట్టర్లో స్పందించారు. గంగాధర్ విధుల్లో చేరిన 50 రోజుల్లోనే సస్పెండ్ కావడం గమనార్హం. కాగా, ‘కేంద్రంలోని ఎన్పీయే(నిరర్థక) ప్రభుత్వానికి కనీస ప్రణాళిక లేనందునే దేశీయంగా బొగ్గుకొరత ఏర్పడింది. దీంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు పెరిగితే ఎవరికి కృతజ్ఞతలు తెలపాలో మీకు తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో వచ్చే వంద ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. -
పరకాల కమిషనర్‌పై వేటు
పరకాల: వార్డుల పునర్విభజన డాక్యుమెంటేషన్ అందించడంలో జరిగిన జాప్యంపై పరకాల పురపాలక సంఘం కమిషనర్ బి.శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొత్త కమిషనర్‌గా పురపాలక శాఖ ఆడిట్ విభాగం సీనియర్ అధికారి ఎల్.రాజాకు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 17న అందించిన వార్డుల పునర్విభజన, మ్యాప్ వంటి డాక్యుమెంటేషన్ లో జరిగిన పొరపాట్లపై వివరణ కోరేందుకు సీడీఎంఏ ప్రయత్నించగా కమిషనర్ అందుబాటులో లేకపోవడం.. పైగా ఫోన్ చేసినా స్పందిం చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్పులు చేసిన డాక్యుమెంటేషన్‌ను మరుసటి రోజు కమిషనర్ శ్రీనివాస్ కార్యాలయంలో అందజేయకుండా కింది స్థాయి అధికారులతో పంపడాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణి స్తూ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ సీడీ ఎంఏ అధికారి శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. -
అప్పుల మూటతో.. ‘టాటా’
బహుశా!! టాటాలు తాము అడుగుపెట్టిన ఏ రంగం నుంచి కూడా ఇన్ని నష్టాలతో... ఇంత దారుణంగా నిష్క్రమించి ఉండలేదేమో!! టెలికం మాత్రం వారికి ఆ చేదు అనుభవాన్ని రుచి చూపించింది. ఈ రంగంలో టాటాల వెంచర్లన్నీ దారుణమైన నష్టాలను మిగిల్చాయి. అంతేకాదు!! 2జీ స్కామ్‌తో టాటా బ్రాండ్ ప్రతిష్టపైనా మచ్చపడింది. అంతర్జాతీయ భాగస్వామితో వివాదం మామూలుగా దెబ్బతీయలేదు. దేశీ టెలికం విప్లవాన్ని ఊహించి అందరికన్నా ముందే ఈ రంగంలోకి దిగినా... కీలకమైన నిర్ణయాలన్నీ ఎదురుతిరిగి వైకుంఠపాళి పాముల్లా మింగేశాయి. ఆఖరికి అట్టడుగుకు జారిపోవటంతో.. ఆస్తులన్నీ ఉచితంగా ధారపోసి అప్పులతో నిష్క్రమించక తప్పలేదు. అయినా దేశంలో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే టాటా గ్రూప్ ఒక్క టెలికంలోనే ఎందుకు ఇంతలా దెబ్బతింది? ప్రొఫెషనలిజానికి మారుపేరుగా ఉండే ఈ గ్రూప్... ఎందుకు రాణించలేకపోయింది? ఏ నిర్ణయాలు దెబ్బ తీశాయి? పరిస్థితులు అనుకూలించలేదా? లేక మేనేజ్మెంట్ లోపాలున్నాయా? ప్రభుత్వ పాలసీలే శరాఘాతమయ్యాయా? పోటీని తట్టుకోలేకపోయిందా? ఒక్కసారి చూద్దాం... (సాక్షి, బిజినెస్ విభాగం):దేశంలో మొబైల్ సర్వీసులు ఆరంభించడానికి 1992లో కేంద్రం మొట్టమొదట బిడ్లు ఆహ్వానించినపుడే టాటాలు కూడా రంగంలోకి దిగారు. కాకపోతే తొలిదశలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలకు పోటీ పడినా... టాటాల చేతికి ఏ సర్కిలూ రాలేదు. ముంబైని బీపీఎల్ టెలికమ్, మ్యాక్స్ టచ్ దక్కించుకోగా... ఎయిర్టెల్, స్టెర్లింగ్ సంస్థలు ఢిల్లీని... ఉషామార్టిన్, మోది టెల్స్ట్రా సంస్థలు కోల్‌కతాను... స్కైసెల్, ఆర్పీజీ సెల్యులార్‌లు చెన్నైని దక్కించుకున్నాయి. దీంతో లైసెన్స్ పొందని కంపెనీలన్నీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని ఆరోపించాయి. ఈ ఆరోపణలు సర్వీసుల ఆరంభాన్ని మరో మూడేళ్లు ఆలస్యం చేశాయిగానీ... ఫలితాన్ని మాత్రం మార్చలేకపోయాయి. తదుపరి 1995లో టెలికం విభాగం 21 సర్కిళ్లకు బిడ్లు పిలిచింది. అప్పుడు టాటాలకు తొలి లైసెన్స్ దక్కింది. అది కూడా... ఆంధ్రప్రదేశ్ నుంచే!!. టాటా గ్రూప్ తాను అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా మొదటి మూడు స్థానాల్లో మాత్రమే ఉండాలని కోరుకుంటుంది. చాలా రంగాల్లో ఇదే పరిస్థితి ఉంది కూడా!! టెలికంలోనే ఇదే పరిస్థితిని ఆకాంక్షించిన టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్)... 2000లో బిర్లా– ఏటీ అండ్ టీతో చేతులు కలిపింది. కాకపోతే కొద్ది కాలానికే టెక్నాలజీపై భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వినియోగదారులకు స్పష్టమైన వాయిస్‌తో అద్భుతమైన అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో టాటాలు సీడీఎంఏ (కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్) టెక్నాలజీకి ఓటేశారు. బిర్లాలు మాత్రం జీఎస్ఎంవైపు (గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్స్) మొగ్గారు. ఇదిగో... ఈ తేడా టాటాల్ని సొంతగా కార్యకలాపాలు ఆరంభించుకునేలా చేసింది. 2002లో హ్యూస్ టెలికంను కొన్న టాటా... టాటా టెలి మహారాష్ట్రగా దాని పేరు మార్చి అక్కడా సీడీఎంఏ కార్యకలాపాలు ఆరంభించింది. 2006లో రతన్ టాటా ఐడియాలోని తన వాటాను విక్రయించేశారు కూడా!!. ఆ ఒక్క నిర్ణయం మార్చేసింది!! నిపుణుల మాటల్లో చెప్పాలంటే... జీఎస్‌ఎంతో సేవలు ఆరంభించిన టాటాలు సీడీఎంఏవైపు మళ్లటం తప్పటడుగే. ‘‘ఖరీదైన లగ్జరీ కారును తెచ్చి నిరుపేదలకు సవారీగా అందించాలనుకోవటం సరికాదు. సీడీఎంఏ కూడా అలాంటిదే’’ అనేది టెలికం నిపుణుల మాట. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా సీడీఎంఏ టెక్నాలజీతో సేవలందిస్తోంది. అప్పట్లోనే ఆ సంస్థ బిజినెస్ నెమ్మదించటం మొదలైంది కూడా. సీడీఎంఏలో ఒక టెలికం ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్‌కు మారడం కష్టం. అలా మారాలంటే హ్యాండ్‌సెట్‌ను మార్చి కొత్తది తీసుకోవాలి. నంబరు మార్చడానికి కొత్త ఫోన్ కొనాల్సిన పరిస్థితిని ఎవరు ఆహ్వానిస్తారు చెప్పండి? ఇక సీడీఎంఏ ఆపరేటర్లు తక్కువ కావటంతో మొబైల్ మోడళ్లు కూడా తక్కువే ఉండేవి. ఇక జీఎస్‌ఎంలో ఒక ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్‌కు మారాలంటే సిమ్ మారిస్తే చాలు. దీంతో జీఎస్ఎం ఫోన్లు కూడా బోలెడన్ని మోడళ్లు అందుబాటులో ఉండేవి. అదే జీఎస్ఎం ఆధిపత్యానికి దారితీసింది కూడా. తప్పు దిద్దుకున్నా... ఫలితం లేదు!! 2007లో డ్యూయల్ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసి అనుమతి పొందిన టాటా టెలిలో... 2008 నవంబర్‌లో జపాన్ దిగ్గజం ఎన్టీటీ డొకొమో 27.71% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ.12,924 కోట్లు వెచ్చించింది. డొకొమో ఊతంతో టాటా దూకుడుగా ముందుకెళ్లటానికి ప్రయత్నించింది. 2009 జూన్‌లో ‘వన్పైసా పర్ సెకన్’ బిల్లింగ్‌తో తమ జోరు పెంచే ప్రయత్నం చేసింది. కానీ ఈ టారిఫ్ డొకొమోకు సైతం ఇష్టం లేదు. అందుకేనేమో!! ఇది సంచలనం అయ్యింది కానీ టాటా డొకోమోకు వినియోగదారుల్ని మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. వ్యాపారం అనుకున్నట్లుగా సాగకపోవటంతో ఆరేళ్ల తరవాత తన వాటా విక్రయించేసి బయటపడాలని డొకోమో భావించింది. వీళ్లిద్దరి ఒప్పందం ప్రకారం... డొకోమో కొనుగోలు చేసిన మొత్తంలో సగం చెల్లించి ఆ వాటాను టాటాయే తీసుకోవాలి. లేదంటే వాటాదారును టాటాలే వెదకాలి. ఆర్బీఐ నియంత్రణలను చూపిస్తూ... టాటా చేతులెత్తేసింది. దీంతో వివాదం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. అక్కడ ఎదురుదెబ్బ తగలటంతో... 1.2 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.7,500 కోట్లు చెల్లించి టాటాలు వివాదాన్ని పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ఇది టాటా బ్రాండ్ ఇమేజ్‌నూ కొంత దెబ్బతీసిందనే చెప్పాలి. 2జీ స్కామ్... దెబ్బతీసింది యావత్తు టెలికం రంగానికే 2జీ స్కామ్ మచ్చలాంటిది. స్పెక్ట్రమ్‌ను మార్కెట్ ధర కన్నా తక్కువకు విక్రయించారనే ఆరోపణలు ఈ రంగాన్ని చుట్టేశాయి. ఇది టాటాలనూ దెబ్బతీసింది. 2జీ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు 2012లో 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. ఇందులో టాటాలకు చెందిన అస్సాం, జమ్మూకశ్మీర్, నార్త్ఈస్ట్ లైసెన్స్‌లూ ఉన్నాయి. లైసెన్స్ కోల్పోవడంతోపాటు యూనిటెక్‌తో డీల్ విషయంలోనూ టాటాలు ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చింది. 2జీ దెబ్బ తర్వాత టాటా గ్రూప్ టెలికంలో ఎలాంటి కొనుగోళ్లూ చేయలేదు. దూకుడుగా నిర్ణయాలు సైతం తీసుకోలేదు. ఈ స్కామ్ ఒక స్తబ్దతను తెచ్చిందనేది నిపుణుల మాట. భారీ రుణాలు... నష్టాలు 2008–16 మధ్య టాటా టెలీ సర్వీసెస్ నష్టాలు ఏకంగా రూ.31వేల కోట్లు. ఇదే కాలంలో టాటాటెలీ మహారాష్ట్రకొచ్చిన నష్టాలు రూ.5,600 కోట్లు. టాటా టెలీ రుణాలు రూ.35,204 కోట్లు. డొకోమోకు చెల్లించిన మొత్తం రూ.7,500 కోట్లపైగానే ఉంది. జియోతో ఎగ్జిట్? రిలయన్స్ జియో రంగంలోకి రావటానికి ముందే... టెలికంలో కొనసాగించడం కష్టమని టాటా భావించింది. 2015 మార్చి నాటికి టాటా టెలి రెవెన్యూ మార్కెట్ వాటా కేవలం 7.2 శాతం. అదే సమయంలో టాప్–3 సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా రెవెన్యూ మార్కెట్ వాటా 72 శాతం. జియో రాకతో పరిస్థితి మరింత జఠిలమయింది. వొడాఫోన్ లాంటివే మనుగడ కోసం కలిసిపోతుంటే.. ఇక మధ్యస్థాయి కంపెనీల పరిస్థితి ఎలా ఉంటుంది? జియోలా అందుబాటు రేటులో బండిల్ డేటా ప్లాన్లను అందించడం వీటికి తలకు మించిన భారం. జియో వల్ల టాటా టెలి చాలా కస్టమర్లను కోల్పోయింది. జియోకు పోటీగా సేవలందించాలంటే టాటా గ్రూప్‌కు 8–10 బిలియన్ డాలర్ల మేర కొత్త ఇన్వెస్ట్మెంట్లు కావాలి. ఎటుచూసినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో టాటా టెలీని ఎయిర్‌టెల్‌కు అప్పగిస్తూ చంద్రశేఖరన్ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల టాటాలకు ఒరిగిందేమీ లేదు. టాటా టెలి, టాటా టెలి మహారాష్ట్ర సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఎయిర్‌టెల్‌కి లభిస్తారు. ఎయిర్టెల్ మాత్రం టాటాకు రూపాయి కూడా ఇవ్వదు. పైపెచ్చు టాటా టెలి సంస్థలకున్న భారీ రుణాల్ని కూడా టాటా గ్రూపే తీరుస్తుంది. కాకపోతే స్పెక్ట్రమ్ కోసం టెలికం విభాగానికి టాటా చెల్లించాల్సిన మొత్తాలను విడతల వారీగా ఎయిర్టెల్ చెల్లిస్తుంది. టాటా టెలి ఉద్యోగులను ఎయిర్టెల్ తీసుకుంటుంది. అంటే... అప్పులు మూటగట్టుకుని ఉత్తచేతులతో నిష్క్రమించారన్న మాట!!. -
గ్రేటర్లో 5 మున్సిపాలిటీల ఏర్పాటు!
గ్రామాల డీనోటిఫై.. నేడో రేపో ఉత్తర్వుల జారీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది. గ్రేటర్ శివార్లలోని జల్పల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, పిర్జాదిగూడ, బోడుప్పల్లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోంది. మొత్తం పదకొండు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మూడేళ్ల కిందటే కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియలో భాగంగానే సంబంధిత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. కానీ కొన్ని గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని పేర్కొంది. ఈలోగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రామ పంచాయతీలను డీ నోటిఫై చేసి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. -
పుర ఖజానాలకు సర్కారు నజరానా..
బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణ త్వరలో విడుదల కానున్న ఉత్తర్వులు మున్సిపాలిటీలకు పెరగనున్న రాబడి మండపేట : పురపాలక సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. గతంలో మాదిరి అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ (బీపీఎస్, ఎల్ఆర్ఎస్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈమేరకు కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)ను ఆదేశించినట్టు సమాచారం. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పునరుద్ధరణకు త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో అక్రమ నిర్మాణాలు, అనధికార లే అవుట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, పరిసరాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది. అనధికార లే అవుట్లలో ఇల్లు నిర్మించుకున్న వారు మౌలిక వసతుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో పక్క అనధికార నిర్మాణాలు చేసిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయా వర్గాల వారికి ఊరట కల్పించడంతో పాటు, పురపాలక సంస్థలకు ఆదాయం సమకూర్చే దిశగా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్), లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ల ద్వారా భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చారు. తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం పలు దఫాలుగా దీనిని 2013 మే వరకు కొనసాగించి తర్వాత నిలిపివేసింది. వీటి ద్వారా జిల్లాలోని నగర, పురపాలక సంస్థలకు భారీగా ఆదాయం సమకూరగా రోడ్లు, డ్రైన్లు, తాగునీటి వసతి తదితర మౌలిక వసతుల కల్పనకు వినియోగించే వీలు కలిగింది. ప్రస్తుతం అదే తరహాలో అనధికార భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన మున్సిపల్ సమీక్ష సమావేశంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏను సీఎం ఆదేశించినట్టు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు త్వరలో బీసీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చంటున్నాయి. కాగా గతంలో కోర్టు కేసుల్లో ఉన్న వాటిని మిన హాయించగా తాజా ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉందంటున్నారు. -
స్పెక్ట్రం రిజర్వ్ ధరపై సిఫార్సులు సబబే: ట్రాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రం మూడో విడత వేలానికి సంబంధించి కీలక నగరాల్లో రిజర్వ్ ధరను 60 శాతం దాకా తగ్గించాలంటూ చేసిన సిఫార్సులకు తాము కట్టుబడి ఉన్నామని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రం వేలం సిఫార్సులపై స్పష్టత కోరిన టెలికం విభాగానికి (డాట్) ఈ మేరకు తన వివరణనిచ్చింది. సీడీఎంఏ సేవలకు ఉపయోగపడే 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌ని వేలం వేయరాదని, దీనిపై త్వరపడి నిర్ణయం తీసుకోరాదని చేసిన సిఫార్సులకు కూడా కట్టుబడి ఉన్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ స్పెక్ట్రం అసలు సామర్థ్యం, వినియోగించుకుంటున్న సామర్థ్యానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంది. స్పెక్ట్రం రిజర్వ్ ధరలను భారీగా తగ్గించాలన్న సిఫార్సులను పునఃసమీక్షించాలని ట్రాయ్‌ని డాట్ కోరడం తెలిసిందే. దీనిపై ట్రాయ్ తాజా వివరణలను అధ్యయనం చేశాక డాట్ కమి టీ తన నివేదికను కొన్ని రోజుల్లో టెలికం కమిషన్(టీసీ) ముందు ఉంచనుంది. టీసీ అభిప్రాయాన్ని బట్టి సాధికారిక మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకుంటుంది.