గ్రామాల డీనోటిఫై.. నేడో రేపో ఉత్తర్వుల జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారులో ఐదు మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది. గ్రేటర్ శివార్లలోని జల్‌పల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, పిర్జాదిగూడ, బోడుప్పల్‌లను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ సన్నాహాలు చేస్తోంది. మొత్తం పదకొండు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు మూడేళ్ల కిందటే కమిషనర్ అండ్ డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియలో భాగంగానే సంబంధిత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిలిపివేసింది.
కానీ కొన్ని గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనలతో అప్రమత్తమైన రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని పేర్కొంది. ఈలోగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం 11 గ్రామ పంచాయతీలను డీ నోటిఫై చేసి కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్‌లో 5 మున్సిపాలిటీల ఏర్పాటు!
Published Thu, Apr 7 2016 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM
Advertisement
Advertisement