
ఎంబీఏ చదివినా.. కులవృత్తి మానలే..
ఈత కల్లు గీస్తున్న ఈ యువకుడి పేరు బండి రమేష్. ఊరు పరకాల. అయితే ఏంటి..? అనేగా మీ అనుమానం. ఏమీ లేదు కానీ.. అతను చదువుకున్నది ఎంబీఏ మరి. పెద్ద చదువులు చదువుకున్నా కులవృత్తిపై ఉన్న మక్కువతో చెట్లు ఎక్కడం, కల్లు గీయడం నేర్చుకున్నాడు.
సీజన్లో మోకు ముత్తాదు కట్టుకుని ఇలా కల్లు గీస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బీఏ జర్నలిజం చేసిన తర్వాత ఎంబీఏ పూర్తిచేశాడు. సర్కారు కొలువు దక్కకపోవడంతో కులవృత్తికి అంకితమైపోయాడు రమేష్.