
బంధువుల కోసం విలపిస్తున్న అనాథ వృద్ధురాలు
పరకాల : మానసిక స్థితితో బాధపడుతున్న వృద్ధురాలు రెండు రోజులుగా అమాయకపు చూపులు..చేతులు చాపలేని దుస్థితి. పట్టించుకునేవారు ఒక్కరూ లేరు. వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాతోనే రెండు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది. బస్టాండ్‌లో అందరూ యాచకురాలిగానే చూస్తున్నారు తప్పా ఆమె ఆకలి బాధను, ఆవేదనను గుర్తించేవారే లేరు.
బస్టాండ్‌లో అనుమానస్పదంగా కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చావని, ఎటు వెళ్లాలని సాక్షి విలేకరి ప్రశ్నించగా ఏదో చెప్పాలని ఉన్నా నోటి మాట రాక తల్లడిల్లిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో అరటి పండ్లు, భోజనం అందజేశారు. ఆర్టీసీ సెక్యూరిటీ వృద్ధురాలు బంధువుల జాడ కోసం ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment