న్యూఢిల్లీ: జాంటీ రోడ్స్.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ క్రికెటర్ పేరు వింటేనే అప్పట్లో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఎంతలా అంటే అతను ఫీల్డింగ్ చేస్తున్న చోటుకి బంతిని కొట్టాలంటే స్టార్ ఆటగాళ్లు సైతం భయపడేవారు. అటు అద్బుతమైన క్యాచ్‌లు పట్టడంతో పాటు మెరుపు రనౌట్లు చేయడంలో అతనికి అతనే సాటి. 1992 ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోడ్స్ గాల్లో సమాంతరంగా డైవ్ చేస్తూ వికెట్లను గిరాటేయడం అతని వేగవంతమైన ఫీల్డింగ్‌కు ఒక చక్కటి ఉదాహరణ.
అయితే తాజాగా జాంటీ రోడ్స్‌ను భారత ఆటగాడు వినయ్‌కుమార్ మరిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్‌లో భాగంగా కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ అద్భుతమైన ఫీల్డింగ్ చేసి అబ్బురపరిచాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుర్‌కీరత్ స్క్వేర్‌లెగ్ వైపు షాట్ ఆడి నిదానంగా పరిగెత్తాడు. అక్కడి నుంచి వచ్చిన త్రో వికెట్లను తాకకుండా మిడాఫ్‌వైపు వెళ్లింది. కాగా, అక్కడే ఉన్న వినయ్ మెరుపులా బంతిని పట్టుకుని రోడ్స్ తరహాలో గాల్లోకి ఎగిరి.. నేరుగా వికెట్లను నేలకూల్చాడు.
Comments
Please login to add a commentAdd a comment