
మయాంక్ మార్కండే(3.1-0-4-4)
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ చరిత్రలో మణిపూర్ అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూఫ్-బిలో పంజాబ్‌తో మ్యాచ్‌లో 40 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్ల దాటికి విలవిలలాడిని మణిపూర్ బ్యాటర్స్‌లో 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రెక్స్ సింగ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జట్టు స్కోరు 40 అంటే అందులో రెక్స్‌వి 25 పరుగులు.. మిగతా 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందునా ముగ్గురు బ్యాటర్స్ డకౌట్‌గా వెనుదిరిగారు. మార్కండే 4 వికెట్లతో చెలరేగగా.. రమణ్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, అభిషేక్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బల్తేజ్ సింగ్, హర్‌ప్రీత్ బార్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 5.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 28 నాటౌట్ జట్టును గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment