శతక్కొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు.. 61 బంతుల్లో 119 నాటౌట్‌ | Syed Mushtaq Ali Trophy 2021-22: Prabhsimran smashes Cracking Century Against Goa | Sakshi
Sakshi News home page

Mustaq Ali Trophy 2021-22: శతక్కొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు

Published Sat, Nov 6 2021 8:37 PM | Last Updated on Sat, Nov 6 2021 8:39 PM

Syed Mushtaq Ali Trophy 2021-22: Prabhsimran smashes Cracking Century Against Goa - Sakshi

Prabhsimran smashes Cracking Century Syed Mushtaq Ali Trophy: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫి 2021-22 సీజన్‌లో భాగంగా గోవాతో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌(61 బంతుల్లో 119; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. ఫలితంగా పంజాబ్‌ 81 పరుగుల తేడాతో గోవాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌ వివరాల్లోకి వెళితే..

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సహా శుభ్‌మన్‌ గిల్‌(36 బంతుల్లో 40; 2 ఫోర్లు), అభిషేక్‌ శర్మ(17 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ బౌలర్లు సిద్దార్ధ్‌ కౌల్‌(3/21), హర్ప్రీత్‌ బ్రార్‌(2/12), మయాంక్‌ మార్కండే(2/29) రాణించడంతో గోవా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 116 పరుగులకే పరిమితమైంది. గోవా ఇన్నింగ్స్‌లో సుయాశ్‌ ప్రభుదేశాయ్‌(30), శుభమ్‌ రాంజనే(19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌(ముస్తాక్‌ అలీ ట్రోఫి)లో ఐపీఎల్‌ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(చెన్నై), దీపక్‌ హుడా(పంజాబ్‌ కింగ్స్‌), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(పంజాబ్‌ కింగ్స్‌) చెలరేగి ఆడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో రుతురాజ్‌ 70.67 సగటుతో 212 పరుగులు చేయగా.. దీపక్‌ హుడా 195 సగటుతో 195, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 71 సగటుతో 142 పరుగులు స్కోర్‌ చేశారు. 
చదవండి: T20 World Cup 2021: ఆసీస్‌ చేతిలో విండీస్‌ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement