సిట్టింగ్ రంగ | Sitting in the sector | Sakshi
Sakshi News home page

సిట్టింగ్ రంగ

Published Tue, Apr 8 2014 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM

సిట్టింగ్ రంగ - Sakshi

సిట్టింగ్ రంగ

  •       కాంగ్రెస్ జాబితా..
  •      పదిచోట్ల సిట్టింగ్‌లకే మళ్లీ చాన్స్
  •      దానం, ముఖేష్ పాత స్థానాల నుంచే పోటీ
  •      శంకర్రావు, సబితకు దక్కని అవకాశం
  •      రాజేందర్, మైనంపల్లికి కలిసిరాని ఫిరాయింపు
  •      పాతబస్తీలో కొత్త వారికే టికెట్లు
  •  సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో సార్వత్రిక సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని సిద్ధం చేసింది. పాత అభ్యర్థులకే పెద్దపీట వేసింది. గ్రేటర్ పరిధిలోని 24 శాసనసభ స్థానాల్లో పది స్థానాలను.. వాటికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారికే కేటాయించింది. మరో పది చోట్ల పూర్తిగా కొత్త ముఖాలను బరిలోకి దించింది. ఇప్పటికే రెండేళ్ల రాజ్యసభ పదవీ కాలం కలిగిన వి.హన్మంతరావుకు అంబర్‌పేట స్థానాన్ని కేటాయించింది.

    మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌లో అవకాశమిచ్చింది. మహేశ్వరం, కంటోన్మెంట్ సీట్ల విషయంలో ఒకింత సంచలనానికి తావిచ్చింది. ఈ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ శంకర్రావుకు మొండిచేయి చూపింది. మల్కాజిగిరి సీటును జీహెచ్‌ఎంసీ కోఆప్షన్ సభ్యుడు నందికంటి శ్రీధర్‌కు కేటాయించింది.

    ఈ శాసనసభ స్థానం కోసం పోటాపోటీగా టీఆర్‌ఎస్, టీడీపీల నుంచి  కాంగ్రెస్‌లో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్, మైనంపల్లి హన్మంతరావుకు రిక్తహస్తమే మిగిలింది. కూకట్‌పల్లి స్థానానికి సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరకు ప్రజారాజ్యం నుంచి పాత బోయిన్‌పల్లి కార్పొరేటర్‌గా గెలిచిన ముద్దం నర్సింహయాదవ్ పేరు ఖరారైంది.

    ఇక, స్థాన మార్పిడి కోసం యత్నించినా.. దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌కు పాత (ఖైరతాబాద్, గోషామహల్) స్థానాలే దక్కాయి. సికింద్రాబాద్ స్థానం కోసం అనేక మంది పోటీపడ్డా సినీ నటి, సిట్టింగ్ ఎమ్మెల్యే జయసుధ పట్లే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఎల్‌బీనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు స్థానాల్లో సిట్టింగ్‌లే మళ్లీ అభ్యర్థులుగా బరిలో నిలవనున్నారు. ఉప్పల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డికి కేటాయించారు.
     
    శంకర్రావు, సబితలకు నో ఛాన్స్

     
    అనేక వివాదాలు, విచిత్రకరమైన వ్యవహారశైలికి కేరాఫ్‌గా నిలిచే డాక్టర్ పి.శంకర్రావుకు టికెట్ దక్కలేదు. తనకు బదులు తన కుమార్తె సుష్మిత పేరైనా పరిశీలించాలని ఆయన చేసిన విజ్ఞప్తులను అధిష్టానం పట్టించుకోలేదు. ‘ఒక కుటుంబం- ఒక సీటు’ నినాదం దరిమిలా.. మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డికి ఎక్కడి నుంచీ అవకాశం ఇవ్వకుండా, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ కేటాయించింది. మహేశ్వరం స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుటుంబ సభ్యులకూ అవకాశం కల్పించలేదు.

    ముషీరాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న అంజయ్య సతీమణి మణెమ్మ తనకు బదులు కుమారుడు శ్రీనివాసరెడ్డికి అవకాశమివ్వాలని చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. నాంపల్లి, కార్వాన్‌లలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన వినోద్, రూప్‌సింగ్‌లకు ఈసారీ అవకాశం దక్కగా, మలక్‌పేటలో 1986లో కార్పొరేటర్‌గా గెలిచిన దూదిపాల వెంకటనర్సింహారెడ్డికి టికెట్ కేటాయించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా స్థానాల్లో కొత్త వారిని రంగంలోకి దించారు.
     
     అభ్యర్థి పేరు:వి. హనుంతరావు
     తల్లిదండ్రులు: కోటమ్మ, లక్ష్మయ్య
     పుట్టిన తేదీ: 16.6.1948
     విద్యార్హతలు: బీఏ
     కుటుంబం: భార్య, ముగ్గురు కుమార్తెలు
     రాజకీయ నేపథ్యం: 1974 నుంచి 78 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. 1982-83లో బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా,1990-92 పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1992 నుంచి రాజ్యసభ సభ్యులుగా  ఉన్నారు.
     
     పేరు: ఎం.ముఖేష్‌గౌడ్
     తల్లిదండ్రులు: నర్సింహాగౌడ్, లలిత
     వయసు: 55 ఏళ్లు
     కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె
     రాజకీయ నేపథ్యం: 1985లో జాంబాగ్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1989లో మహరాజ్‌గంజ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో 150 ఓట్ల తేడాతో ఓటమి. 1999లో మరోసారి ఓటమి. 2004లో మహరాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహాల్ నుంచి గెలుపు.
     
     అభ్యర్థి పేరు:మర్రి శశిధర్‌రెడ్డి
     తండ్రి: మర్రి చెన్నారెడ్డి
     వయసు: 59 ఏళ్లు
     చదువు: ఎంఎస్
     కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు
     చిరునామా: లాలాగూడ, సికింద్రాబాద్.
     రాజకీయ నేపథ్యం: 1992లో తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లోనూ గెలిచారు. 1999లో శ్రీపతి రాజేశ్వర్ (టీడీపీ) చేతిలో ఓటమి. 2004, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
     
     అభ్యర్థి పేరు: పి.విష్ణువర్ధన్‌రెడ్డి
     తల్లిదండ్రులు: పి.జనార్ధన్‌రెడ్డి, ఇందిర
     విద్యార్హత: పాలిటెక్నిక్
     నివాసం: దోమలగూడ
     కుటుంబం: భార్య, ఓ కూతురు
     రాజకీయ నేపథ్యం: తండ్రి పి.జనార్ధన్‌రెడ్డి మరణానంతరం విష్ణువర్ధన్‌రెడ్డి ఉప ఎన్నికలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందా  రు. నియోజకవర్గాల పునర్విభజనలో భా గంగా 2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
     
     అభ్యర్థి: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
     తండ్రి: జయచంద్రారెడ్డి
     కుటుంబం: భార్య, ఇద్దరు కొడుకులు
     పుట్టిన తేదీ: 27-7-1962
     విద్యార్హత: బీఏ
     రాజకీయ నేపథ్యం: 1980లో కాంగ్రెస్ పార్టీ లో చేరిక. 1986 నుంచి 2004 వరకు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, నగర కాంగ్రె స్ ప్రధాన కార్యదర్శిగా, కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2004-2008 మధ్య హుడా చైర్మన్‌గా, 2009లో ఎల్‌బీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
     
     అభ్యర్థి పేరు: మారబోయిన భిక్షపతి యాదవ్
     తండ్రి: సందయ్య
     పుట్టిన తేదీ: 6-1-1956
     విద్య: మెట్రిక్యులేషన్
     కుటుంబం: భార్య, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు
     రాజకీయ నేపథ్యం: 1970లో కొండాపూర్ ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం శేరిలింగంపల్లి మున్సిపల్ చైర్మన్, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, శేరిలింగంపల్లి మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
     అభ్యర్థి పేరు: బండారి లక్ష్మారెడ్డి
     తండ్రి: జంగారెడ్డి
     పుట్టిన తేదీ: 27 నవంబర్ 1967
     విద్యార్హత: బి.కామ్
     చిరునామా: సైనిక్‌పురి, కాప్రా.
     రాజకీయ నేపథ్యం: ఉప్పల్ సిట్టంగ్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డికి ఇతను సోదరుడు. జేఎన్‌టీయూ హెచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
     
     అభ్యర్థి పేరు: ముద్దం నర్సింహ యాదవ్
     పుట్టిన తేదీ: 31.12.1969
     చదువు: 5వ తరగతి
     కుటుంబం: భార్య,కొడుకు
     తల్లిదండ్రులు: శంకరయ్య, లక్ష్మమ్మ
     రాజకీయ నేపథ్యం: కూకట్‌పల్లి మున్సిపాలి టీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. ప్రజారాజ్యం ఆవిర్భాంతో అందులో చేరారు. 2009లో ఓల్డ్ బోయిన్‌పల్లి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గ్రేటర్ లో పీఆర్‌పీ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్ ఈయనే.
     
     అభ్యర్థి పేరు:నందికంటి శ్రీధర్
     పుట్టిన తేదీ: 2-9-1972
     విద్యార్హత:    బీకామ్
     కుటుంబం: భార్య, ఇద్దరు పిల్లలు
     రాజకీయ నేపథ్యం: అల్వాల్ యూత్ కాం గ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 2000-2005 కౌన్సిలర్‌గాను, ప్రస్తుతం గ్రేటర్ కో ఆష్షన్ సభ్యులుగా ఉన్నారు. మల్కాజిగిరి సీటు హాట్ ఫేవరెట్‌గా మారిన క్రమంలో ఈయన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
     
     అభ్యర్థి పేరు: కె.వెంకటేశ్
     తండ్రి: ప్రకాశ్
     పుట్టిన తేదీ: 9-8-1970
     విద్యార్హత: బీకామ్
     కుటుంబం: భార్య, కుమారుడు, కుమార్తె
     రాజకీయ నేపథ్యం: 2006లో ఆంధ్రప్రదేశ్ రాజీవ్ సేవా సమితిని స్థాపించి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు.
     
     అభ్యర్థి పేరు: బి.ఆర్.సదానంద్ ముదిరాజ్
     తండ్రి: డి.రాములు
     పుట్టిన తేదీ: 22-6-1976
     విద్యార్హత:  బీఏ
     కుటుంబం: భార్య, కూతురు
     రాజకీయ నేపథ్యం: 1988 నుంచి పార్టీలో క్రీయాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్‌ఎస్‌యూఐ గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఫలక్‌నుమా డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టీయుసీ) చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
     
     అభ్యర్థి పేరు: సయ్యద్ అబ్దుల్ సమీ (అత్తర్)
     తండ్రి : అబ్దుల్ హమీద్
     పుట్టిన తేదీ : 11-6-1971
     విద్యార్హత : బీకామ్
     కుటుంబం: భార్య, ఇద్దరు కుమార్తెలు
     రాజకీయ నేపథ్యం: 2002లో కాంగ్రెస్‌లో చేరారు. 2003లో బహదూర్‌పురా నియోజకవర్గం మైనార్టీ కో-ఆర్డినేటర్‌గా, 2005లో కాంగ్రెస్ గ్రేటర్ కమిటీ వైస్ చైర్మన్‌గా, రాజేంద్రనగర్ డిపో ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
     
     అభ్యర్థి పేరు: దూదిపాల వెంకట నర్సింహారెడ్డి
     తల్లిదండ్రులు: కృష్ణారెడ్డి, అనసూయదేవి
     పుట్టిన తేదీ: 11-1-1955
     విద్యార్హతలు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్
     కుటుంబం: భార్య హేమలత, ఇద్దరు కుమారులు
     రాజకీయ నేపథ్యం: 1977 నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నారు. 1986లో మూసారంబాగ్ కార్పొరేటర్‌గా అటు తరువాత యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
     
     అభ్యర్థి పేరు: బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్
     తండ్రి: వెంకటస్వామి
     పుట్టిన తేదీ: 27-05-1964
     విద్యార్హత: బీఏ
     రాజకీయ నేపథ్యం: 1991-97 వరకు రాజేంద్రనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో బండ్లగూడ గ్రామ జాగీర్ సర్పంచ్, నార్సింగ్ వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.
     
     అభ్యర్థి పేరు: దానం నాగేందర్
     తండ్రి: లింగమూర్తి
     పుట్టిన తేదీ: 9 ఆగస్టు 1958
     విద్యార్హత: ఎంఏ
     నివాసం: బంజారాహిల్స్
     రాజకీయ నేపథ్యం: మూడుసార్లు ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా, 2009లో ఖైరతాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
     
     మళ్లీ సీటు దక్కిన సిట్టింగ్‌లు..
     దానం నాగేందర్=    ఖైరతాబాద్
     ముఖేష్‌గౌడ్    =గోషామహల్
     మర్రి శశిధర్‌రెడి=    సనత్‌నగర్
     విష్ణువర్ధన్‌రెడ్డి    =జూబీహిల్స్
     జయసుధ=    సికింద్రాబాద్
     సుధీర్‌రెడ్డి    =ఎల్‌బీనగర్
     భిక్షపతియాదవ్=    శేరిలింగంపల్లి
     కూన శ్రీశైలంగౌడ్=    కుత్బుల్లాపూర్
     నందీశ్వర్‌గౌడ్=    పటాన్‌చెరు
     కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి    =మేడ్చల్
     
     వీరికి తొలిసారి పోటీకి అవకాశం

     బండారి లక్ష్మారెడ్డి-    ఉప్పల్
     ఎం.నర్సింహయాదవ్-    కూకట్‌పల్లి
     నందికంటి శ్రీధర్-    మల్కాజిగిరి
     వినయ్‌కుమార్-    ముషీరాబాద్
     క్రిషాంక్-    కంటోన్మెంట్
     అశ్విన్‌రెడ్డి-    చాంద్రాయణగుట్ట
     కె.వెంకటేష్-    చార్మినార్
     సదానంద్ ముదిరాజ్    -యాకుత్‌పురా
     అబ్దుల్ సమీ-    బహదూర్‌పురా
     డీవీఎన్‌రెడ్డి-    మలక్‌పేట
     
     గతంలో పోటీ.. మళ్లీ చాన్స్..

     రూప్‌సింగ్=    కార్వాన్
     వినోద్‌కుమార్=    నాంపల్లి
     జ్ఞానేశ్వర్ ముదిరాజ్=    రాజేంద్రనగర్
     వి.హన్మంతరావు=    అంబర్‌పేట
     మహేశ్వరం=    సీపీఐ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement