సకల కళా సంబరం | All art Brownie | Sakshi
Sakshi News home page

సకల కళా సంబరం

Published Sun, Jan 5 2014 12:42 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

సకల కళా సంబరం - Sakshi

సకల కళా సంబరం

సంప్రదాయ కళల సమాహారంగా మారింది విశ్వకళా మహోత్సవం. రెండోరోజు కార్యక్రమాలు ఆద్యంతం రసరమ్యంగా సాగింది. కళారంగంలో ఉన్న మాధుర్యాన్ని ప్రేక్షకులకు పంచింది. శనివారం జరిగిన కార్యక్రమాల్లో మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, అసోంకు చెందిన వందలాది మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. ప్రారంభోత్సవంలో విశ్వకళా మహోత్సవ కమిటీ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ప్రసంగించారు.
 
పామర్రు/గుడివాడ, న్యూస్‌లైన్ : తమిళనాడుకు చెందిన పాండిచ్చేరి యూనివర్సిటీ డీన్ నేతృత్వంలో దాదాపు 32మంది కళాకారులు గంటపాటు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. తమిళనాడు ఫోక్ డ్యాన్స్, టప్పాటం డ్యాన్స్, కర్హాటం, పెరియ మేళం డ్యాన్సులతో ఉర్రూతలూగించారు.
 
 అసోంలోని గువహతి నుంచి వచ్చిన యువకులు బిహూ డ్యాన్సుతో ఆకట్టుకున్నారు.
 
 ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీలక్ష్మీ నరసింహ కోలాట సమాజం వారి జడకోలాటం ఉత్సాహంగా సాగింది.
 
 ఒంగోలుకు చెందిన ఆర్.లయ ఈలపాటతో శభాష్ అనిపించుకుంది.
 
 హైదరాబాద్‌కు చెందిన విభూషణం కల్యాణి గాత్ర కచేరి వీనులవిందుగా సాగింది.
 
 హైదరాబాద్‌కు చెందిన శంకర నారాయణ హాస్య కార్యక్రమం కడుపుబ్బ నవ్వించింది.
 
 తెనాలికి చెందిన ప్రముఖ హరికథా గాయకుడు చందూ భాస్కర్ తన హరికథా గానంతో ప్రేక్షకులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచెత్తారు.
 
 పామర్రుకు చెందిన 77ఏళ్ల కళాకారుడు శ్రీకృష్ణుడు వేషధారణలో పౌరాణిక పద్యాలు వినిపించి ప్రశంసలు పొందారు.
 
 లాస్య నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
 హైదరాబాద్‌కు చెందిన మోహన్‌బాబు చేసిన పప్పేట్ షో ఆశ్చర్యపరిచింది.
 
 నృత్యేంద్రజాలం పేరుతో రవళి, రవితేజ చేసిన డ్యాన్స్ అలరించింది. సంప్రదాయ నాట్యం నుంచి మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ వరకు దాదాపు ఐదు రకాల వస్త్రధారణతో వారిద్దరూ ఆకట్టుకున్నారు.
 
 అంబిక ప్రదర్శించిన రింగ్ డ్యాన్సు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది.
 
 కళారూపాలను కాపాడండి
 పామర్రు : రోజూ టీవీ, సెల్‌ఫోన్లు వాడుతూ ప్రతి ఒక్కరూ కళలకు దూరమవుతున్న ఈరోజుల్లో కళాలను అందరికీ అందించేందుకు ఐఆర్‌డీఏ పనిచేయడం అభినందనీయమని రామ్‌కీ ఫౌండేషన్ సీఈవో ఎంవీ రామిరెడ్డి పేర్కొన్నారు. పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణం, సిద్ధేంద్రయోగి కళావేదిక వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన విశ్వ కళామహోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళా రూపాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఐఆర్‌డీఏ అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్ మాట్లాడుతూ పట్టణాలలో ఇటువంటి కార్యక్రమాలకు ఆదరణ తక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకళాపరిషత్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరీ, విశ్రాంత ఇన్‌కమ్ టాక్స్ కమిషనర్ చుక్కా రామస్వామి, ప్రముఖ కళాకారులు శ్రీ కళాకృష్ణ, డాక్టర్ కుసుమ గాయత్రి, బైసాని నాగే శ్వరరావు, సితార్ విధ్వాంసుడు వినోద్, ఫ్రాన్స్ దేశస్తులు డానియేల్ నెజర్సు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement