Pawan negi
-
క్రిస్ గేల్ ఊచకోత.. 46 బంతుల్లోనే 10 సిక్సర్ల సాయంతో..!
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు, తెలంగాణ టైగర్స్ ప్లేయర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్ గేల్ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న యూనివర్సల్ బాస్.. 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినప్పటికీ.. తెలంగాణ టైగర్స్ విజయం సాధించలేకపోవడం కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర్‌ప్రదేశ్.. నిర్ణీత 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 269 పరుగులు (నాలుగు వికెట్ల నష్టానికి) చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 139; 16 ఫోర్లు, 8 సిక్సర్లు), అన్షుల్ కపూర్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకంతో విజృంభించారు. ఆఖర్లో కెప్టెన్ సురేశ్ రైనా (13 బంతుల్లో 27; 5 ఫోర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. Chris Gayle masterclass in the IVPL. 🔥pic.twitter.com/v3ggELI13K— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2024 అనంతరం అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్.. క్రిస్ గేల్ రెచ్చిపోయినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. గేల్ ఔటైన తర్వాత ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి తెలంగాణ 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఏడాదే కొత్తగా ప్రారంభమైన ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL) ఫిబ్రవరి 23న మొదలైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ లాంటి స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. -
ఇషాంత్, నేగిలను తప్పించారు
న్యూఢిల్లీ: ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే గత ఐపీఎల్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ పవన్ నేగిని అక్షరాలా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది! అప్పటి వేలంలో ఇదో సంచలనం. అయితే ఈ సంచలనం ఒక్క సీజన్‌కే పరిమితైంది. ఈ సారి వేలానికి ముందు డేర్‌డెవిల్స్ అతన్ని వదిలేసుకొంది. అతనితో పాటు భారత పేసర్ ఇషాంత్ శర్మ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు వద్దనుకున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో చెన్నై టెస్టులో ఆడుతున్న ఇషాంత్ సహా పీటర్సన్‌లను రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ విడుదల చేసింది. గుజరాత్ లయన్స్ స్టెయిన్‌ను వద్దనుకుంది. -
పవన్ నేగీ అవుట్!
ముంబై: ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచిన పవన్ నేగీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. పవన్ నేగీకి చెల్లించే మొత్తం ఎక్కువగా ఉండటంతోనే అతన్ని వచ్చే సీజన్ లో పాల్గొనే ఢిల్లీ జట్టు నుంచి విడుదల చేసినట్లు డేర్ డెవిల్స్ స్పష్టం చేసింది. 'అవును పవన్ నేగీని జట్టు నుంచి తొలగించాం. ఇక్కడ ప్రదర్శన ఆధారంగానే అతని విడుదలపై నిర్ణయం తీసుకున్నాం. దాంతో పాటు అతని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రెండు కారణాలతో పవన్ నేగీని విడుదల చేయాల్సి వచ్చింది' అని ఢిల్లీ డేర్ డెవిల్స్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఐపీఎల్ వేలంలో పుణే సూపర్ జెయింట్స్ తో పోటీపడి పవన్ నేగీని దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ఏడాది వ్యవధిలోనే అతన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 8.5 కోట్లు చెల్లించి పవన్ ను ఢిల్లీ కొనుగోలు చేసింది. అయితే గడిచిన ఐపీఎల్లో పవన్ నేగీ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 57 పరుగులు మాత్రమే చేయడం అతని తొలగింపుకు ప్రధాన కారణమైంది. భారత్ తరపున నేగీ ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆసియాకప్‌లో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నేగీ పాల్గొన్నాడు. ఆ తరువాత ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20కి నేగీని ఎంపిక చేసినా రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉండగా, పవన్ నేగీతో సహా ఐదుగురు ఆటగాళ్లను ఢిల్లీ డేర్ డెవిల్స్ విడుదల చేయడం గమనార్హం. -
ధోని గుర్తించాడు.. జహీర్ విస్మరించాడు!
చెన్నై:ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 వ సీజన్ లో రికార్డు ధర పలికిన ఆటగాళ్లలో పవన్ నేగీ ఒకడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పవన్ నేగీకి 8.5 కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డేవిల్స్ కొనుగోలు చేసింది. ఆర్సీబీ ఆటగాడు షేన్ వాట్సన్ 9.5 కోట్ల అత్యధిక ధర తరువాత పవన్ నేగీదే ఎక్కువ మొత్తం కావడం విశేషం . దీంతో పవన్ నేగీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన మరుసటి రోజే టీమిండియా జట్టులో అవకాశం దక్కింది. ఆసియాకప్, వరల్డ్ టీ 20 టోర్నీలకు చోటు దక్కడంతో తన అదృష్టాన్ని నేగీనే నమ్మలేకపోయాడు. కాగా, ఐపీఎల్లో నేగీ ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో అతనిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై తాజాగా స్పందించిన నేగీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతిభను ఢిల్లీ డేర్ డెవిల్స్ సరిగా గుర్త్తించలేదంటూ విమర్శించాడు. తనకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా ఢిల్లీ ఎందుకు పక్కను పెట్టిందో ఇప్పటికీ అంతుపట్టడం లేదని వ్యాఖ్యానించాడు. తనకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇవ్వడంలో ఢిల్లీ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. తనను తప్పించిన విషయాన్నిజట్టు యాజమాన్యం కూడా ఏనాడో చెప్పలేదని స్పష్టం చేశాడు. ' గతంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తన ప్రతిభను గుర్తించాడు. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ జహీర్ ఖాన్ మాత్రం తాను జట్టులో ఉన్నా పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. జహీర్ దగ్గరకు వెళ్లి బౌలింగ్ ఇమ్మని అడగలేను కదా. అతనొక సీనియర్ ప్లేయర్ అయ్యుండి కూడా తన ప్రతిభను గుర్తించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది' అని జహీర్ పై అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్‌లాడిన పవన్ నేగీ తొమ్మిది ఓవర్లు పాటు బౌలింగ్ వేసి ఒక వికెట్ తీస్తే, మొత్తంగా 57 పరుగులు చేశాడు. అందులో అతని బెస్ట్ 19 పరుగులు. -
మనోళ్ళే ముద్దు
♦ దేశవాళీ క్రికెటర్లపై కాసుల వర్షం స్టార్ క్రికెటర్లకు తగ్గిన రేటు ♦ ఐపీఎల్ వేలంలో అమ్ముడైన 94 మంది క్రికెటర్లు ♦ యువరాజ్ కంటే పవన్ నేగీకి ఎక్కువమొత్తం ♦ అందరికంటే ఎక్కువగా వాట్సన్‌కు రూ.9.5 కోట్లు గత ఏడాది వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం అంటే కాసుల వర్షం... పేరున్న ప్రతి క్రికెటర్‌కూ భారీగా డబ్బులు వచ్చేవి. కానీ ఈసారి ట్రెండ్ మారింది. ఫ్రాంచైజీలు ఆచితూచి డబ్బు ఖర్చు చేశాయి. కోట్లు పోసి విదేశీ క్రికెటర్లను తెచ్చి బెంచ్‌లపై కూర్చోబెట్టడం అనవసరమనే భావనతో వ్యవహరించాయి. దేశవాళీ క్రికెట్లో కొద్దోగొప్పో ఆడేవాళ్లపై కూడా కాసుల వర్షం కురిపించారు. అనామకులైనప్పటికీ నైపుణ్యం ఉందని భావించిన వాళ్లకోసం కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద ఈసారి వేలంలో గతంతో పోలిస్తే స్టార్ క్రికెటర్లకు నిరాశ ఎదురైనా... దేశవాళీ ఆటగాళ్ల జేబులు నిండాయి. బెంగళూరు: గత రెండు సీజన్ల వేలంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లందరికీ నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితం బెంగళూరు రూ. 14 కోట్లు... ఏడాది క్రితం వేలంలో ఢిల్లీ రూ. 16 కోట్లు ఇచ్చి కొనుక్కున్న యువరాజ్‌ను... ఈసారి కేవలం రూ.7 కోట్లకే హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకుంది. గత ఏడాది ఏకంగా రూ. 12 కోట్లు దక్కించుకున్న దినేశ్ కార్తీక్ ఈసారి కేవలం రూ. 2 కోట్ల 30 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ క్రికెటర్ కోసమూ భారీగా వెచ్చించడం అనవసరమనే భావనలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. వేలానికి వచ్చే సమయానికే ప్రతి జట్టులోనూ కావలసినంత మంది స్టార్ క్రికెటర్లు ఉన్నారు. కాబట్టి విదేశీ స్టార్ల కోసం వెంపర్లాడే బదులు... దేశవాళీ క్రికె ట్లో నిలకడగా ఆడిన, సంచలనాలు సృష్టించిన ఆటగాళ్లకు అన్ని ఫ్రాంచైజీలు పెద్ద పీట వేశాయి. ఇప్పటివరకూ భారత్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని పవన్ నేగీకి ఏకంగా రూ. 8.5 కోట్లు లభించాయి. ఇది యువరాజ్ సింగ్ కంటే ఎక్కువ కావడం చెప్పుకోదగ్గ విశేషం. అలాగే సంజు శామ్సన్ (రూ. 4.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 4 కోట్లు), దీపక్ హుడా లాంటి దేశవాళీ క్రికెటర్లు జాక్‌పాట్ కొట్టారు. ముస్తాక్ అలీ టి20 టోర్నీలో చక్కగా బౌలింగ్ చేసిన తమిళనాడు లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు ఏకంగా రూ. 4.5 కోట్లు దక్కడం విశేషం. వేలం హైలైట్స్ రెండేళ్ల నుంచి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న కెవిన్ పీటర్సన్ మొదట వేలంలోకి వచ్చాడు. ఇతనికోసం పుణే, గుజరాత్ మాత్రమే పోటీపడ్డాయి. డ్వేన్ స్మిత్, ఇషాంత్ శర్మల కోసం కూడా గుజరాత్, పుణేలు పోటీపడినా.. మధ్యలో వేరే ఫ్రాంచైజీలు రావడంతో ధర కాస్త పెరిగింది. టెస్టులకు గుడ్‌బై చెప్పిన ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ నాలుగో ఆటగాడిగా వేలంలోకి వచ్చాడు. ఇక అన్ని ఫ్రాంచైజీలు ఈ ఆల్‌రౌండర్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. బెంగళూరు రూ. ఐదున్నర కోట్లకు తీసుకెళ్లడంతో పుణే వెనక్కితగ్గింది. అయితే ముంబై రాకతో రేట్ అమాంతం పెరిగింది. చివరకు బెంగళూరు రికార్డు ధరకు కొనుగోలు చేసింది. యువరాజ్ వేలానికి వచ్చినప్పుడు ఫ్రాంచైజీలు బాగా తటపటాయించాయి. అయితే 2 కోట్లతో ముంబై వేలాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రూ. 5 కోట్ల తర్వాత బెంగళూరు పక్కకు తప్పుకోగా ముంబై దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లింది. చివరకు రూ. 6 కోట్ల వద్ద ఆలస్యంగా వేలంలోకి వచ్చిన హైదరాబాద్ మరింత పెంచి సొంతం చేసుకుంది. ♦ ఆసీస్ టి20 కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను మొదట వేలంలో ఎవరూ తీసుకోలేదు. కానీ రెండోసారి రావడంతో రూ. 1 కోటి బేస్‌ప్రైస్‌కే గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. ♦ గతేడాది కోట్లలో పలికిన స్పిన్నర్ అమిత్ మిశ్రా పరిస్థితి ఈసారి ఘోరంగా మారింది. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయాడు. ♦ మొత్తం 351 మంది క్రికెటర్లు అందుబాటులో ఉంటే... ఫ్రాంచైజీలు 94 మందిని మాత్రమే తీసుకున్నాయి. ఓవరాల్‌గా 257 మందికి నిరాశ ఎదురైంది. ♦ భారత అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా పని చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ♦ ఓవరాల్‌గా వేలంలో తీసుకున్న ఆటగాళ్లలో భారత్‌కు ఆడిన ప్లేయర్లు 15, దేశవాళీ క్రికెటర్లు 51, ఆసీస్ నుంచి 13, దక్షిణాఫ్రికా నుంచి 4, వెస్టిండీస్ నుంచి 4, ఇంగ్లండ్ నుంచి ముగ్గురు, న్యూజిలాండ్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ఒక్కో ఆటగాడు ఉన్నారు. ♦ అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్ల వైపు కూడా ఫ్రాంచైజీలు బాగానే మొగ్గు చూపాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఇషాన్ కిషన్‌ను రూ. 35 లక్షలకు గుజరాత్ కొనుగోలు చేసింది. ఇక రిషబ్ పంత్‌ను ఏకంగా రూ. 1.9 కోట్లకు ఢిల్లీ చేజిక్కించుకుంది. ♦ సెలబ్రిటీలు నీతా అంబానీ (ముంబై), ప్రీతి జింతా (పంజాబ్), విజయ్ మాల్యా (బెంగళూరు), మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఫ్లెమింగ్, లక్ష్మణ్, మూడీ, బ్రాడ్ హాడ్జ్, వెటోరి తమ ఫ్రాంచైజీల తరఫున వేలంలో పాల్గొన్నారు. తమ్ముడికి రెండు కోట్లు! ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు క్రునాల్ హిమాన్షు పాండ్యా, కర్ణాటక ఆటగాడు కిశోర్ కామత్ కోసం ఫ్రాంచైజీలు ఊహించని రీతిలో డబ్బుల వర్షం కురిపిం చాయి. రూ. 10 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన ఈ ఇద్దరి కోసం ముంబై, ఢిల్లీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు క్రునాల్‌ను రూ. 2 కోట్లకు, కామత్‌ను రూ. 1.4 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. గుజరాత్‌కు చెందిన 24 ఏళ్ల క్రునాల్ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తమ్ముడు. ఐపీఎల్ లెక్కల ప్రకారం ముంబై ఇండియన్స్ హార్దిక్‌కు రూ.10 లక్షలు చెల్లిస్తుండగా... అదే ముంబై క్రునాల్‌కు రూ.2 కోట్లు ఇవ్వబోతోంది. మరోవైపు కిశోర్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. రాష్ట్ర జట్టుకుగానీ, అండర్-17, 19 జట్లకుగానీ ప్రాతినిధ్యం వహించలేదు.