abhimanyu mithun
-
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్.. వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్- నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్ విచిత్రమైన నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో మిథన్ వేసిన నో బాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 5 ఓవర్లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్ ఓవర్ స్టేప్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో అతడు ఫుట్కు క్రీజుకు మధ్య దూరం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు క్రీజు నుంచి చాలం దూరంలో తన ఫుట్‌ను ల్యాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నోబాల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్ 9.7 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. What's happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10 pic.twitter.com/FGcbshIhPz — Farid Khan (@_FaridKhan) December 2, 2023 -
టైటిల్ వేటలో మెరిసిన రాహుల్, అగర్వాల్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక(వీజేడీ పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్ చేసింది కర్ణాటక. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం వీజేడీ పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్(52 నాటౌట్; 72 బంతుల్లో 5ఫోర్లు), మయాంక్ అగర్వాల్(69 నాటౌట్; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కర్ణాటకను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ 598 పరుగులు సాధించాడు. భారత ఇంజనీర్ వి జయదేవన్ రూపొందించిన వీజేడీ పద్ధతిని మ్యాచ్ రద్దయిన పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా భారత్‌లో జరిగే దేశవాళీ టోర్నీలో వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి తమిళనాడును దెబ్బకొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్ లభించింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!) -
హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!
బెంగళూరు: కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మిథున్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ ఐదు వికెట్లలో హ్యాట్రిక్ సాధించడంతో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో హ్యాటిక్ర్ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మిథున్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్ మూడో బంతికి షారుఖ్(27) వికెట్ సాధించిన మిథున్.. ఆపై వరుస రెండు బంతుల్లో ఎమ్ మహ్మద్((10), మురుగన్ అశ్విన్(0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఫలితంగా హ్యాట్రిక్ వికెట్ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్‌లకు తలో వికెట్ లభించింది. -
23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివిన రెయాన్ ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. రెయాన్కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్‌కు ఈ నెల 23 న చెన్నైలో వివాహనిశ్చితార్థం జరపనున్నట్లు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్ వెల్లడించారు. వివాహ తేదీని నిశ్చితార్థం రోజు వెల్లడించనున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. కాగా అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టులో క్రీడాకారుడు. అతడు మంచి బౌలర్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో త్వరలో వీరి వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్‌లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్‌ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్‌కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్‌కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్‌లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్‌జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.