23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం | Radhika Sarathkumar's Daughter to Marry Cricketer Abhimanyu Mithun | Sakshi
Sakshi News home page

23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం

Published Sat, Sep 12 2015 9:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం

23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం

చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక  త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం  ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్‌లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివిన రెయాన్ ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది.

రెయాన్‌కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్‌కు ఈ నెల 23 న చెన్నైలో వివాహనిశ్చితార్థం జరపనున్నట్లు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్ వెల్లడించారు.  వివాహ తేదీని నిశ్చితార్థం రోజు వెల్లడించనున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు.

 కాగా అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టులో  క్రీడాకారుడు. అతడు మంచి బౌలర్‌. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో త్వరలో వీరి వివాహాన్ని ఘనంగా  జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement