చాంపియన్కు టీమిండియా షాక్ | India beats westindies in T-20 world cup | Sakshi
Sakshi News home page

చాంపియన్కు టీమిండియా షాక్

Published Sun, Mar 23 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

చాంపియన్కు టీమిండియా షాక్

చాంపియన్కు టీమిండియా షాక్

మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయం నమోదు చేసి సెమీస్ రేసులో ముందంజ వేసింది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్తో జరిగిన ఏకపక్ష మ్యాచ్లో ధోనీసేన ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. 130 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ ధవన్ (౦) తొలి ఓవర్లోనే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (62 నాటౌట్), యువ సంచలనం విరాట్ కోహ్లీ (54) హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించారు. తొలి మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే.

తాజా మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లో ఏడు వికెట్లకు  129 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు స్మిత్, క్రిస్ గేల్ లు ఆదిలో చెత్త బంతులపై మాత్రమే అటాక్ చేస్తూ వికెట్లను కాపాడుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే స్మిత్(11) పరుగుల వద్ద ఉండగా అశ్విన్ కు దొరికిపోయాడు.  మంచి దూకుడుమీద ఉన్న క్రిస్ గేల్ (34) అనవసర పరుగుకోసం ప్రయత్నించి రనౌట్ రూపంలో వికెట్టు సమర్పించుకున్నాడు.
 
అనంతరం శ్యామ్యూల్స్ (18),  సిమ్మన్స్(27)  పరుగులు చేసి జట్టు స్కోరును చక్కదిద్దారు.  చివరి వరుస ఆటగాళ్లు ఎవరూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విండీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో జడేజాకు మూడు వికెట్లు లభించగా, అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement