చిట్టగాంగ్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శనివారం దక్షిణాఫిక్రాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియాకప్ ను కైవసం చేసుకుని మంచి ఊపుమీద ఉన్న శ్రీలంకతో పోరుకు సఫారీలు సిద్ధమైయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లిసెస్ గాయం కారణంగా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. దీంతో దక్షిణాఫ్రికా కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా గాయం నుంచి తిరిగి కోలుకున్న బౌలర్ డేల్ స్టెయిన్ జట్టులో చేరాడు.
ప్రధాన రౌండ్ పోటీలు నిన్నటి నుంచి ఆరంభమైయ్యాయి. శుక్రవారం జరిగిన పాకిస్తాన్-భారత్ ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి మజాను ఆస్వాదించారు. ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా ఆసక్తికరంగా జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.