
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో జయసూర్యకు ఇది 10వ ఐదు వికెట్ల ఘనత. జయసూర్య కేవలం 34 ఇన్నింగ్స్‌ల్లోనే 10 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. జయసూర్య టెస్ట్ అరంగేట్రం నుంచి ఎవ్వరూ ఇన్ని ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయలేదు. జయసూర్య తర్వాత అత్యధికంగా అశ్విన్ 7 ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు.
జయసూర్య టెస్ట్ అరంగేట్రం తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్లు..
ప్రభాత్ జయసూర్య-10 (34 ఇన్నింగ్స్‌ల్లో)
అశ్విన్-7 (38 ఇన్నింగ్స్‌ల్లో)
పాట్ కమిన్స్-6 (39 ఇన్నింగ్స్‌ల్లో)
తైజుల్ ఇస్లాం-5 (25 ఇన్నింగ్స్‌ల్లో)
రబాడ-5 (28 ఇన్నింగ్స్‌ల్లో)
రవీంద్ర జడేజా-5 (32 ఇన్నింగ్స్‌ల్లో)
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక లక్ష్యానికి 143 పరుగుల దూరంలో ఉంది. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.
ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 205/5గా ఉంది. ధనంజయ డిసిల్వ (39), కుసాల్ మెండిస్ (39) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, డేన్ పీటర్సన్ తలో 2 వికెట్లు తీయగా.. రబాడ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య ఐదు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బేశాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (55), బవుమా (66) అర్ద సెంచరీలతో రాణించారు.
దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. 89 పరుగులు చేసిన పథుమ్ నిస్సంక టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేన్ పీటర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్ (101), కైల్ వెర్రిన్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. లంక బౌలర్లలో లహీరు కుమార అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment